Telangana DGP on G20 Working Group Meetings: జీ 20 వర్కింగ్ గ్రూప్ భద్రతపై డీజీపీ కీలక నిర్ణయాలు
Telangana DGP on G20 Working Group Meetings: ఈ ఏడాది జీ 20 సమావేశాలకు భారత్ వేదిక కానున్నది. ఈ సమావేశాలకు ముందు దేశ వ్యాప్తంగా 56 నగరాల్లో 215 వర్కింగ్ గ్రూపు సమావేశాలను నిర్వహించనున్నారు. జీ20 సమావేశాల్లో ఏయే అంశాలపై చర్చించాలి అనే దానిపై దృష్టి సారించే క్రమంలో వర్కింగ్ గ్రూప్ సమావేశాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో జనవరి 28 నుండి జూన్ 17 వ తేదీ మధ్యలో 12 సమావేశాలు జరగనున్నాయి. తొలి సమావేశం జనవరి 28 వ తేదీన జరగనున్నది. ఈ వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు.
హైదరాబాద్ నరగంలో 12 వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ నేతృత్వంలో పోలీసు ఉన్నతాధికారులు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. అదేవిధంగా జీ 20 వర్కింగ్ గ్రూప్ భేటీలను విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో జనవరి 28, మార్చి 6,7, ఏప్రిల్ 26,27,28, జూన్ 7,8,9,15,16,17 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల కోసం విస్తృత స్థాయి ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ సమావేశాలు కావడంతో అదనపు భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.