TS: విద్యుత్ వినియోగంలో తెలంగాణ రికార్డు, ఒక్కరోజే 15 వేల మెగావాట్ల వాడకం
Telangana Creates records in Electricity Usage
తెలంగాణలో విద్యుత్ వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. మార్చి 13న రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా అత్యధిక విద్యుత్ వినియోగం జరిగినట్లు తెలుస్తోంది. మార్చి 14న ఉదయం 10.03 గంటలకు ఏకంగా 15,062 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం నాడు 14,138 మెగా వాట్ల విద్యుత్ జరిగిందని, మంగళవారం నాటికి ఆ వినియోగం మరింత పెరిగిందని జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు.
మొత్తం విద్యుత్ వినియోగంలో 37 శాతం వ్యవసాయ రంగానిదేనని CMD ప్రభాకర్ రావు తెలిపారు. దేశంలో వ్యవసాయ రంగానికి అత్యధిక విద్యుత్ వినియోగం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ప్రభాకర్ రావు తెలిపారు. విద్యుత్ వినియోగం విషయంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానంలో నిలవగా.. తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని ప్రభాకర్ రావు తెలిపారు.
రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యధిక విద్యుత్ డిమాండ్ మార్చి 13న రికార్డు అయినట్లు ప్రభాకర్ రావు తెలిపారు. రికార్డ్ స్థాయిలో 15254 మెగా వాట్లు నమోదు అయిందని… గత సంవత్సరం మార్చి నెలలో 14160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం కాగా.. ఈ సారి గత సంవత్సరం రికార్డ్‌ను అధిగమించి ఈ నెలలోనే 15254 మెగా వాట్ల ఫీక్ డిమాండ్ నమోదు అయిందని ప్రభాకర్ రావు తెలిపారు.
వేసవిలో 16 వేల మెగావాట్ల వాడకం
ఈ ఏడాది వేసవి కాలంలో 16 వేల మెగా వాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉందని ప్రభాకర్ రావు తెలిపారు. డిమాండ్ తగ్గ సరఫరా ఖచ్చితంగా చేస్తామని ప్రభాకర్ రావు తెలిపారు. మార్చి నెలలో 15000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అవుతుందని ముందే ఉహించామని ప్రభాకర్ రావు తెలిపారు.