Bandi Sanjay: రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్ కి దేశంలో ఉండే అర్హత లేదు..బండి సంజయ్
Bandi Sanjay: దేశమంతటా అంగరంగ వైభవంగా ఘనంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై నిప్పులుచెరిగారు. అనేక మంది త్యాగాలతో సాధించుకున్న దేశానికి.. గొప్ప రాజ్యాంగాన్ని అందించారు అంబెడ్కర్ ప్రపంచంలో అత్యున్నతమైన రాజ్యాంగం మనది దానిని గౌరవించుకోవడం భారతీయులుగా మనబాధ్యత అనిఅన్నారు. పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఓటు హక్కు కల్పించారు అంబెడ్కర్. ఆ హక్కునేడు కొందరు డబ్బుతో ముడేస్తున్నారు. డబ్బులువెదజల్లి ఓట్లు దండుకుంటున్నారు.
మోడీ ప్రధాని అవ్వడానికి కారణం రాజ్యాంగమే అలాగే దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెడుతున్నఏకైక వ్యక్తి మోడీ అనిపేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రికి రాజ్యాంగం, కోర్ట్, మహిళలు అంటే గౌరవం లేదు..గణతంత్ర వేడుకల గురించి కూడా కోర్టుకి వెళ్లాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి నేడు రాష్ట్రంలో వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. సాయుధ దళాల పరేడ్ లేకుండా చేసాడు కెసిఆర్. గవర్నర్ వ్యవస్థనే గౌరవించడం లేదు. మహిళా గవర్నర్ ని కూడా గౌరవించడం లేదు. బిఆర్ఎస్ పెట్టిన తరువాత కలిసిన ప్రతిఒక్కరికి ఇదే చెప్పవా అని సూటిప్రశ్న వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్ కి దేశంలో ఉండే అర్హత లేదు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామన్నారు.