Telangana Cabinet Meeting: నేడు తెలంగాణ క్యాబినెట్ మీటింగ్… వీటిపైనే చర్చ
Telangana Cabinet Meeting: తెలంగాణ రాష్త్ర మంత్రి వర్గ సమావేశం నేడు జరగనున్నది. త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమౌతున్న తరుణంలో ఈ మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో రైతు బంధు నిధుల విడుదల, ఇంటి నిర్మాణం కోసం రూ. 3 లక్షల ఆర్థిక సాయం, పోడు భూములు సహా అనేక రకాలైన కీలక అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా శాసనసభ సమావేశాలు, రాష్ట్రంలోని ఆర్థిక స్థితిగతులపై, రాష్ట్రంపై కేంద్రం విధించిన ఆంక్షలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదింప జేయాలని గవర్నర్‌ను కోరే అవకాశం ఉన్నది. దీనిపై కూడా రాష్ట్ర మంత్రి వర్గంలో చర్చించనున్నారు. ఇక విశ్వవిద్యాలయాలకు చాన్స్‌లర్‌గా గవర్నర్‌ను తప్పించేలా బిల్లును తీసుకొచ్చే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది. కొత్తగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ లక్ష్యాలు, కార్యాచరణ ఇతర అంశాలపై కూడా తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది.