TS Cabinet : కేసీఆర్అధ్యక్షతన ఈ నెల 9న కేబినెట్ భేటీ
TS Cabinet: ఈ మధ్య జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రకటించిన.. సొంత ఇళ్ల స్థలాలు ఉన్న వారికి, ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. సొంత స్థలాలు ఉండి ఇళ్లు లేని నిరుపేదలకు 3 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్బంగా మార్చి 9వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్అధ్యక్షతన హైదరాబాద్ ప్రగతి భవన్‌లో ఈ నెల 9న మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి మండలి సమావేశం నిర్వహించనున్నారు.
ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీపై స్పష్టమైన కార్యాచరణపై కేబినెట్‌లో చర్చించే అవకాశముంది దీనిపై మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే చర్చించింది. గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లులు, ఇతర సమావేశాలపై ఈ భేటీలో చర్చకు రానున్నాయి. అలాగే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు, రాష్ట్రం అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నట్టు తెలుస్తుంది.