Telangana Cabinet Meet: తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో వేటిపై చర్చిస్తున్నారంటే…
Telangana Cabinet Meet is underway
తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రారంభం అయింది. అనేక కీలక అంశాలపై సహచరులతో చర్చించిన అనంతరం సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకోనున్నారు. పాలన అంశాలతో పాటు ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా సీఎం చర్చించనున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులను కూడా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. కవితకు ఈడీ నోటీసుల అంశం కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. స్థల క్రమబద్దీకరణ, మూడో విడత గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాల విషయంలో కూడా కేసీఆర్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై చూపిస్తున్న వివక్షను ఎదుర్కోడానికి ఏం చేయాలనే విషయంలో కూడా సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈడీ విచారణ అనంతరం కవితను అరెస్టు చేస్తే ఏం చేయాలనే విషయంలో కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది.
కంటి వెలుగు కార్యక్రమం, మహిళా ఆరోగ్య కార్యక్రమాలపై కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో కూడా సీఎం కేసీఆర్, తన క్యాబినెట్ సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణికి ఛాన్స్ దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి కొన్ని గంటల్లో అన్ని విషయాల్లోను క్లారిటీ రానుంది.