TS Budget: రూ 3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్..!
Telangana State Budget: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు పిబ్రవరి మొదటి వారంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 3 లేదా 5 వ తేదీ నుండి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్ కీలకం కానున్నది. సుమారు రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇక ఈరోజు రాష్ట్రపద్దులపై ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించనున్నారు. ఈ సమీక్ష అనంతరం బడ్జెట్ ను రూపొందించనున్నారు. ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్ర తలసరి ఆదాయం 1.24 లక్షల కోట్లుగా ఉండగా, ఇప్పుడది రూ. 2.75 లక్షల కోట్లకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
వర్షాకాల సమావేశాల తరువాత నిర్వహించాల్సిన శీతాకాల సమావేశాలను నిర్వహించకపోవడంతో అందరిలోనూ పలు అనుమానాలు నెలకొన్నాయి. సీఎం కేసీఆర్ ఫిబ్రవరి నెలాఖరున అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని, ఏప్రిల్ నెలలో సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉంటాయని కథనాలు వెలువడ్డాయి. అయితే, ఫిబ్రవరి మొదటివారంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో ఎన్నికలు యథావిధిగా జరిగే అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.