TS Budget Session: ఫిబ్రవరి 3 నుండి బడ్జెట్ సమావేశాలు..
Telangana Budget Session: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈనెల 3 వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. శీతాకాల సమావేశాలు నిర్వహించకపోవడం చేత, బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 3 వ తేదీ నుండి బడ్జెట్ సమావేశాను నిర్వహించనున్నట్లు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ ఏడాది కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది 2.75 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌లో సంక్షేమం, ఉపాధి, అభివృద్ధి పనులకు నిధులకు కేటాయించే అవకాశం ఉన్నది.
ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్‌లో వేటిని నిధులు కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే, బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 12:10 గంటలకు సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెన్‌ను ప్రవేశపెట్టనున్నది. ఈ బడ్జెట్‌ను అనుసరించి రాష్ట్ర బడ్జెట్‌లో మార్పులు చేర్పులు చేయనున్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసనసభ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. సమావేశాలు ముగిసే వరకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు.