తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మార్పు విషయంలో వస్తున్న వార్తలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొట్టి పారేశారు. ఆ వార్తల్లో నిజం లేదని, అవన్నీ నిరాధార వార్తలని తేల్చిపారేశారు. తామంతా ఒక కుటుంబమని, మా జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవటం చాలా సహజం అని కిషన్ రెడ్డి అన్నారు.
Telangana BJP President will not be Changed, Kishan Reddy clarifies
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మార్పు విషయంలో వస్తున్న వార్తలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy) కొట్టి పారేశారు. ఆ వార్తల్లో నిజం లేదని, అవన్నీ నిరాధార వార్తలని తేల్చిపారేశారు. తామంతా ఒక కుటుంబమని, మా జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవటం చాలా సహజం అని కిషన్ రెడ్డి అన్నారు. ఈ విషయంతో పాటు అనేక విషయాలపై కూడా కిషన్ రెడ్డి (Kishan reddy) క్లారిటీ ఇచ్చారు.
లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవిత విచారణ ప్రస్తుతం జరుగుతోంది. కవిత అరెస్టు ప్రభుత్వం చేతిలో లేదని, విచారణ సంస్థ పరిధిలోని అంశమని కిషన్ రెడ్డి (Kishan reddy) అన్నారు. ఆధారాలున్నాయి కాబట్టే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని సీబీఐ అరెస్ట్ చేసిందని కిషన్ రెడ్డి (Kishan reddy) అన్నారు. అవినీతికి పాల్పడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేను సైతం జైలుకు పంపించామని కిషన్ రెడ్డి (Kishan reddy) గుర్తుచేశారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీను ఎంఐఎం పార్టీ నడిపిస్తోందని కిషన్ రెడ్డి (Kishan reddy) ఆరోపించారు. మహారాష్ట్రలో ఒక వార్డ్ మెంబర్ గెలిచినందుకే బీఆర్ఎస్ నేతలు సంబుర పడుతున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణను అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారని కూడా కిషన్ రెడ్డి (Kishan reddy) అన్నారు. నోట్ల రద్దులో మా ప్లాన్ మాకు ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణలో ఉండదని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి (Kishan reddy) అన్నారు.
పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలి – కిషన్ రెడ్డి
పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ (KCR) కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ (KCR) తన సలహాదారులకు అప్పగించారని ఆరోపించారు. మహారాష్ట్రంలో బీఆర్ఎస్ బ్రాంఛ్ పెట్టుకున్న కేసీఆర్ పనికిరాని వాళ్లను పార్టీలో చేర్చుకుంటున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.
రైతులను,నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు
తెలంగాణ లో రైతులను,నిరుద్యోగులను సీఎం కేసీఆర్ (KCR) పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. పంటల బీమాను ఎందుకు అమలు చేయడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం ప్రతి ఎకరాకు ఎరువుల పైన 18,254 సంవత్సరానికి సబ్సిడీ ఇస్తుందని కిషన్ రెడ్డి(Kishan reddy) గుర్తుచేశారు. రైతులకు ఉచిత ఎరువులు ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ (KCR) ఇంతవరకు ఇవ్వలేదని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పి ఎన్నో సంవత్సరాలు గడిచిందని ఇప్పటి వరకు ఈ హామీని కేసీఆర్ (KCR) ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని, రైతులకు వెన్నుపోటు పొడిచారని కిషన్ రెడ్డి ఆరోపించారు. రైతుల విషయంలో కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని కిషన్ రెడ్డి (Kishan reddy) విమర్శించారు.