Bandi Sanjay: మరో ఆరునెలల్లోనే ఎన్నికలు…
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఆరు నెలల కాలంలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాష్ట్రంలో పోలింగ్ బూత్ స్థాయి కమిటీ సభ్యుల సమావేశంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీకి పోలింగ్ బూత్ స్థాయి సభ్యులే మూలమని, వారి పాత్ర కీలకంగా ఉంటుందని అన్నారు. అధిష్టానం బూత్ కమిటీ సభ్యుల కోసం సరల్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను దేశంలో నడ్డా ప్రారంభించగా, రాష్ట్రంలో బండి సంజయ్ ప్రారంభించారు. సరల్ యాప్‌లో కేంద్రం ఇచ్చిన నిధులను, రాష్ట్రానికి చేసిన అభివృద్ధి పార్టీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను పొందుపరిచారని పేర్కొన్నారు.
రాజకీయాల గురించి కాకుండా, అభివృద్ధి గురించి మాట్లాడాలని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ సర్కార్ దారి మళ్లించి వినియోగించుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో బలంగా ఉందని, పోలింగ్ బూత్ స్థాయిలో కూడా బలంగా మారుతోందని అన్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల బూత్ స్థాయి కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయమని అన్నారు.