తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దళితులు, గిరిజనుల భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఆపాలని, వారికి ఉన్న కనీస జీవనాధారాన్ని కాపాడాలని లేఖ ద్వారా బండి సంజయ్, సీఎం కేసీఆర్ను డిమాండ్ చేశారు
Telangana BJP Chief Bandi Sanjay letter to CM KCR
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దళితులు, గిరిజనుల భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఆపాలని, వారికి ఉన్న కనీస జీవనాధారాన్ని కాపాడాలని లేఖ ద్వారా బండి సంజయ్, సీఎం కేసీఆర్ను డిమాండ్ చేశారు. లేఖ సంధించడం ద్వారా సీఎం కేసీఆర్పై పలు విమర్శలు గుప్పించారు.
ఎన్నో ఏళ్ల క్రితం దళితులకు, గిరిజనులకు అసైన్ చేసిన భూములను మీ ప్రభుత్వం రక్షణ కల్పించకపోగా, వారి జీవనాధారాన్ని దెబ్బ తీస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పోత్రహిస్తోందని, అది దుర్మార్గమని బండి సంజయ్ ఆరోపించారు. దళితులకు, గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న హామీని మీ ప్రభుత్వం వమ్ము చేసిందని, దీంతో లక్షలాది మంది ఆశలు అడియాశలు అయ్యాయని బండి సంజయ్ తన లేఖలో ప్రస్తావించారు.
గత ప్రభుత్వాలు ఎప్పుడో ఇచ్చిన అసైన్డ్ భూముల్లో దళిత, గిరిజన కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాటిని లాక్కోవాలని చూడడం వారి నోటికాడ ముద్ద లాక్కోవడమేనని బండి సంజయ్ తన లేఖలో ప్రస్తావించారు. పోడు భూములకు పట్టాలిస్తామని హామీలు ఇవ్వడమే గానీ, వాటిని అమలులో చూపెట్టడం లేదని బండి సంజయ్ విమర్శించారు.
దళితులు, గిరిజనుల భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఆపాలని, వారికి ఉన్న కనీస జీవనాధారాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి లేఖ. pic.twitter.com/Hlewd09zUc
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 19, 2023