Bandi Sanjay: అమరుల త్యాగాలతో కేసీఆర్ కుటుంబం జల్సా చేస్తోంది
Telangana BJP Chief Bandi Sanjay attacks CM KCR
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై, కేసీఆర్ కుటుంబ సభ్యులపై మరోసారి విమర్శలు గుప్పించారు. లిక్కర్ దందాలో కవిత హస్తం ఉండడం వల్ల దేశంలోని మహిళల ప్రతిష్ట దిగజారిందని బండి సంజయ్ విమర్శించారు. జాతీయ రాజకీయాలు అని బీఆర్ఎస్ పెట్టి దాన్ని కవితకు అప్పగిస్తున్నారని విమర్శలు గుప్పించారు. అది కూడా దేశాన్ని దోచుకోవడానికే అని బండి సంజయ్ విమర్శించారు.
బీజేపీ భిక్ష వల్లనే కేసీఆర్ కు సీఎం పదవి దక్కిందని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లు తీసుకొస్తే తెలంగాణ రాలేదని.. సుష్మా స్వరాజ్ పార్లమెంటులో పోరాడితేనే తెలంగాణ వచ్చిందని బండి సంజయ్ గుర్తుచేశారు.
తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణ తెచ్చింది, ప్రాణత్యాగం చేసింది ఒక్క కుటుంబం కోసమేనా అని ప్రశ్నించారు. అమరుల త్యాగాలతో కేసీఆర్ కుటుంబం జల్సా చేస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ బిడ్డ, కొడుకు అమెరికాలో చిప్పలు కడుగుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని కొడితే కేసీఆర్ పేరు వస్తోందని, గ్రేట్ లీడర్ అంటే నరేంద్ర మోడీ పేరు వస్తోందని బండి సంజయ్ తెలిపారు. కావాలంటే ఫోన్లో చెక్ చేసుకోవచ్చని బండి సంజయ్ తెలిపారు.