TS Assembly: ఫిబ్రవరి 3నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
TS Assembly: ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం 2023-24 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. దాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని సర్కారు భావిస్తోంది. అందుకు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి అసంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలోఉంది తెలంగాణ సర్కార్. ఎన్నికల ఏడాది కావడంతో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి బడ్జెట్ రూపొందించాలని నిర్ణయించింది.
అన్ని శాఖలు ఈ నెల 14 -16 వ తేదీలోపు తమకు ప్రతిపాదనలు పంపాలని ముఖ్య కార్యదర్శులకు ఆదేశించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలతో పాటు బడ్జెట్‌లో దళితబంధు కోసం కేటాయించిన నిధులను వినియోగించకపోవడం ఆ పథకం రెండో విడత ప్రారంభం కాకపోవడం అలాగే గిరిజన బంధు కూడా ఇస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించడంతో వీటిపై అసెంబ్లీలో ఆయన ఏం చెబుతారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక పెండింగ్ లోఉన్న ప్రాజెక్ట్ లగురించికూడా అసెంబ్లీ లో వాడి వేడి చర్చ జరుగనున్నందున సీఎం కెసిఆర్ ముందుగానే ప్రణాళికలు సిద్ధంచేస్తునట్లు వినికిడి.