Surya with NTR: ఎన్టీఆర్ తో సూర్య, ఇద్దరు స్టార్లు ఒకే చోట
Team India Batter Surya Kumar Yadav meets NTR
అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఇద్దరు స్టార్లు ఒక్కచోట కలిశారు. ఫోటోలు దిగారు. అభిమానులను మరోసారి ఫిదా చేశారు. ఆ ఇద్దరిలో ఒకరు హీరో ఎన్టీఆర్ కాగా, మరో స్టార్ సూర్యకుమార్ యాదవ్.
టీమిండియా చిచ్చర పిడుగు సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్నాడు. రేపు జరిగే వన్డే మ్యాచ్ ఆడేందుకు భాగ్య నగరానికి వచ్చాడు. ఇక్కడున్న కొందరు స్నేహితులను కలిశాడు. తన స్నేహితుల ద్వారా హీరో జూనియర్ ఎన్టీఆర్ ను కూడా కలిశాడు. ఫోటోలు దిగాడు. ట్విట్టర్ ద్వారా ఆ ఫోటోలను షేర్ చేశాడు.నిన్ను కలవడం ఎంతో ఆనందంగా ఉంది సోదరా అంటూ సూర్య ట్వీట్ చేశాడు.RRR సినిమా పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్నందుకు మరోసారి కాంగ్రాటులేషన్ అని సూర్య ట్వీట్ ముగించాడు.
It was so lovely meeting you, brother!
Congratulations once again on RRR winning the Golden Globe award 🤩 pic.twitter.com/6HkJgzV4ky— Surya Kumar Yadav (@surya_14kumar) January 17, 2023
ఖరీదైన కార్లను సేకరించడంలో హైదరాబాద్ వాసి నజీర్ ఖాన్ ప్రఖ్యాతి గాంచాడు. దేశ వ్యాప్తంగా చాలా మందిని ఆకట్టుకున్నాడు. వారిలో కొందరు టీమిండియా సభ్యులు కూడా ఉన్నారు. అప్పటి నుంచి నజీర్ ఖాన్ తో వారు టచ్ లో ఉన్నారు. నిన్న రాత్రి నజీర్ ఖాన్ ఇంటికి ఎన్టీఆర్ రావడం, అదే సమయంలో టీమిండియా ప్లేయర్లు రావడం జరిగింది. అక్కడ కలిసి వీరందరూ ఫోటోలు దిగుతూ సందడి చేశారు.