TSPSC: దోషులు ఎవరైనా వదిలేది లేదు – తలసాని
Talasani Srinivas Yadav counter attack on BJP on TSPSC Issue
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మంత్రులు దిద్దుబాటు చర్యలకు దిగారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఈ విషయంలో స్పందించారు. జగిత్యాల వాసి, బీజేపీకి చెందిన రాజశేఖర్ రెడ్డి ఈ కుట్రలో నిందితుడిగా ఉన్నాడని తలసాని గుర్తుచేశారు. దోషులు ఎవరైనా వదిలిపెట్టొద్దని సిట్ అధికారులను కోరుతున్నానని తలసాని అన్నారు.
ప్రవీణ్ అనే వ్యక్తి ఇంకా సెలక్ట్ కాలేదని, రాజకీయ దురుద్దేశ్యంతో బీజేపీ ఆరోపణలు చేస్తోందని తలసాని అన్నారు. చదువుకునే వారికి ఉద్యోగాలు రావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపడుతోందని తలసాని గుర్తుచేశారు. ఇంత పెద్ద నిర్ణయం చరిత్రలో సీఎం కేసిఆర్ తప్ప ఎవరు తీసుకోలేదని తలసాని అన్నారు. రాజకీయ ప్రేరేపణ లేకుండా ఆన్లైన్ ద్వారా భర్తీ చేస్తోంది. పలు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు చైర్మన్లు కూడా మన కమీషన్ ను మెచ్చుకున్నారని తలసాని గుర్తుచేశారు.
మా పార్టీ మా ప్రభుత్వం లక్ష్యం ఒక్కటే నిరుద్యోగులు ఉండొద్దు, ఉద్యోగాలు సాధించి వారు బాగు పడాలని మేము కోరుకుంటున్నామని మంత్రి తలసాని తెలిపారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉద్యోగాల భర్తీలో ఎక్కువ స్కాం లు జరిగాయని గుర్తుచేశారు.
చదువుకునే వారికి ఉద్యోగాలు రావాలనే లక్ష్యం తో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపడుతోంది.
ఇంత పెద్ద నిర్ణయం చరిత్రలో సీఎం కేసిఆర్ తప్ప ఎవరు తీసుకోలేదు.
రాజకీయ ప్రేరేపణ లేకుండా ఆన్లైన్ ద్వారా భర్తీ చేస్తోంది. pic.twitter.com/bJDh14mR9Y
— Talasani Srinivas Yadav (@YadavTalasani) March 16, 2023
ప్రవీణ్ అనే వ్యక్తి ఇంకా సెలక్ట్ కాలేదు.
కానీ రాజకీయ దురుద్దేశ్యంతో ఆరోపణలు చేస్తోంది బీజేపీ.
మా పార్టీ మా ప్రభుత్వం లక్ష్యం ఒక్కటే నిరుద్యోగులు ఉండొద్దు, ఉద్యోగాలు సాధించి వారు బాగు పడాలని మేము కోరుకుంటున్నాం.
బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉద్యోగాల భర్తీ లో స్కాం లు జరిగాయి..
— Talasani Srinivas Yadav (@YadavTalasani) March 16, 2023