Ujjaini Mahakali Bonalu : ఘనంగా ప్రారంభమైన బోనాలు… తలసాని పర్యవేక్షణ
Talasani Srinivas Yadav at Ujjaini Mahakali Bonalu : సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈరోజు ఉదయమే అమ్మవారిని దర్శించుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు మంత్రి తలసాని తొలి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ నాలుగు గంటలకు అమ్మవారి దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, బోనాల పండుగ వచ్చిదంటే ఈ పండగను ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం ఎంతో సంతోషమని, మహంకాలి జాతర విశ్వవ్యాప్తం అయ్యిందని పేర్కొన్నారు. ఇక ఆలయం వద్ద ఏర్పాట్ల గురించి తలసాని మాట్లాడుతూ ఏర్పాట్లు అన్ని డిపార్ట్మెంట్ కలసి ఎంతో బాగా చేసారని మెచ్చుకున్నారు.
దేశ వ్యాప్తంగా అనేక మంది నేడు అమ్మవారిని దర్శించుకుంటారని, ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఏర్పాట్లు చేశామని, ముందు జాగ్రత్త చర్యగా మెడికల్, అంబులెన్స్ ఏర్పాట్లు చేయడం జరిగిందని, కేసిఆర్ ముఖ్యమంత్రి అయ్యిన తరువాత అమ్మవారి దయతో అనేక ప్రాజెక్ట్ లు పూర్తి చేయడం జరిగిందని తెలిపిన తలసాని ఈ రోజు రైతాంగం పాడిపంటలు తో ఉండాలని, యువత ఇలా అన్ని వర్గాలు అభివృద్ధిలో ముందుకు పోవాలని కోరారు. ఇక తాను ఈ రెండు రోజులు ఇక్కడే ఉండి ఏర్పాట్లు చూసుకుంటానని తలసాని స్పష్టం చేశారు. కాగా ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కవిత కూడా అమ్మవారిని దర్శించు కుంటారు. కవిత 10 గంటలకు బంగారు బోనం సమర్పించనుండగా, 11.45 కి సీఎం కేసీఆర్ అమ్మవారిని దర్శించుకోనున్నారు. కాసేపట్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా మహంకాళిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా అందరినీ సాదరంగా ఆహ్వానిస్తామని చెప్పిన తలసాని రంగం కార్యక్రమం తర్వాత అంబారు ఊరేగింపు ఉంటుందని వెల్లడించారు.