Foxconn in Hyderabad: హైదరాబాద్‌లోనే ఫాక్స్‌కాన్…
Foxconn in Hyderabad: ప్రపంచంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సంస్థ ఫాక్స్‌కాన్ హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. త్వరలోనే ఈ సంస్థకు సంబంధించిన కార్యాలయాన్ని హైదరాబాద్ లో ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ తెలియజేసింది. ఇటీవలే ఆ సంస్థ సీఈవో హైదరాబాద్ నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం సీఎం కేసీఆర్ సంస్థ సీఈవో యంగ్‌లియూకి లేఖ రాశారు. ఈ లేఖపై యంగ్‌లియూ స్పందించారు. హైదరాబాద్‌లోనే ఫాక్స్‌కాన్ సంస్థ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
దానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఫాక్స్‌కాన్ సంస్థ ఏర్పాటు ద్వారా రాబోయే పదేళ్ల కాలంలో లక్ష మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. త్వరగా ఫాక్స్‌కాన్ సంస్థ కార్యకలాపాలు సాగించేలా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాగా, తైవాన్‌కు చెందిన ఈ సంస్థ సీఈవో భారత్‌లో పర్యటించిన సమయంలో కర్ణాటక ప్రభుత్వం కూడా ఇదే విధమైన ప్రకటన చేయడంతో గందరగోళం నెలకొన్నది. కాగా, సీఈవో యంగ్‌లియూ హైదరాబాద్‌లోనే ఫాక్స్‌కాన్ ఏర్పాటు ఉంటుందని స్పష్టం చేయడంతో గందరగోళానికి తెరపడింది.