National StarUp Awards: టీ హబ్ అరుదైన ఘనత, మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు
T Hub gets Best incubator award in National Star Up awards
తెలంగాణకు చెందిన టీ హబ్ సంస్థ అరుదైన ఘనతను సొంతం చేసుకుందిన నేషనల్ స్టార్టప్ అవార్డుల్లో తన సత్తా చాటుకుంది. బెస్టు ఇన్ క్యూబేటర్ అవార్డు సొంతం చేసుకుంది. నేషనల్ స్టార్టప్ అవార్డుల్లో తమ సంస్థకు బెస్ట్ ఇన్ క్యూబేటర్ అవార్డు వచ్చిన విషయాన్ని టీ హబ్ సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. రానున్న కాలంలో తమ కృషిని మరింత పెంచుతామని కూడా టీ హబ్ వెల్లడించింది. టీ హబ్ ట్వీట్ ను చూసిన మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారానే శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో పలు ప్రభుత్వ విభాగాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న అవార్డులను గెలుచుకుంటున్నాయి. దేశంలో తమకు ప్రత్యేక స్థానం ఉన్నట్లు ప్రగతి పథంలో అడుగులు వేస్తున్నాయి. పాలకుల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు దూసుకుపోతున్నాయి.
ఐటీ రంగంలో కూడా తెలంగాణ అభివృద్ధి బాటలో నడుస్తోంది. దేశంలో ఏ ఇతర నగరాల్లో లేని విధంగా హైదరాబాద్ నగరంలో ఐటీ వ్యాప్తి శరవేగంగా జరుగుతోంది. ఐటీ ఉద్యోగాల కల్పన విషయంలోను హైదరాబాద్ ముందంజలో ఉంది. ఇటీవలే బెంగళూర్ ను అధిగమించింది. మొదటి స్థానానికి చేరుకుంది. తాజాగా టీ హబ్ కు లభించిన అవార్డు హైదరాబాద్ నగర ఖ్యాతిని మరింత పెంచింది.
Congratulations 👏 Team @THubHyd https://t.co/omrDwgCLAW
— KTR (@KTRTRS) January 16, 2023