Manikrao Thakre: హైదరాబాద్ కు కొత్త కాంగ్రెస్ ఇంచార్జ్.. ఎందుకంటే?
T Congress Incharge Manikrao Thakre to Visit Hyderabad: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా నియమితులు అయిన మానిక్ రావ్ ఠాక్రే ఈనెల 11న హైదరాబాద్ రానున్నారు. 11,12 తేదీల్లో రెండు రోజుల పాటు పార్టీ సమావేశాలతో బిజిబిజీగా గడపనున్నారు ఠాక్రే. ముందుగా 11 తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న ఠాక్రే 11 గంటలకు ఏఐసీసీ సెక్రటరీలతో సమావేశం కానున్నారు. ఆ అనంతరం 11:30 పీసీసీ అధ్యక్షుడితో సమావేశం కానున్న ఠాక్రే 12 గంటలకు సీఏల్పీ నేత భట్టితో సమావేశం కానున్నారు. ఇక మధ్యాహ్నం 12:30 గంటలకు సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో సమావేశం కానున్నారు ఠాక్రే. ఆ తరువాత 3 గంటలకు పొలిటికల్ అఫైర్స్ కమిటీతో, 4 గంటలకు ఎగ్జిక్యూటివ్ కమిటీతో సమావేశం కానున్నారు. 5 గంటలకు పీసీసీ అధికార ప్రతినిధులతో సమావేశం కానున్న ఠాక్రే 12 తేదీన ఉదయం 10:30కి డీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. 11:30 గంటలకు అనుబంధ సంఘాల అధ్యక్షులతో భేటీ కానున్నారు, 12:30 గంటలకు పార్టీలోని వివిధ సెల్స్ ,డిపార్ట్మెంట్ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. ఇక అదే రోజు సాయంత్రం 4 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్లనున్న ఠాక్రే రెండు రోజుల పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలు అధిష్టానానికి అందించనున్నారు.