Swapnalok Complex Fire Accident: స్వప్నలోక్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి
Swapnalok Complex Fire Accident: గురువారం రాత్రి సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్ల అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదం నుండి రెస్క్యూ సిబ్బంది 12 మందిని కాపాడారు. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో మొత్తం 400 వ్యాపార సంస్థలు ఉండగా అందులో 150 వరకు వివిధ రకాల షాపులు, మిగిలినవి కంప్యూటర్ సంస్థలు ఉన్నాయి. అయితే, గురువారం సాయంత్రం నుండి వర్షం కురుస్తుండటంతో చాలా తక్కువ మంది మాత్రమే కాంప్లెక్స్ లో ఉన్నారు. సాధారణ రోజుల్లో వస్త్రదుకాణాల్లో బట్టలు కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడి వస్తుంటారు.
8వ అంతస్తులో మొదట ప్రమాదం చోటు చేసుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు గుర్తించారు. 8వ అంతస్తులో మంటలు ప్రారంభంకాగా, ఏడు, ఆరు, ఐదు ఇలా వరసగా మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు పొగ కమ్మేయడంతో ఊపిరి ఆడక కొంతమంది అక్కడే పడిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని గాంధీకి, సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన వారంతా 20 నుండి 24 ఏళ్లలోపు వారే కావడం విచారించదగ్గ విషయం.