Survey on Sky Cable in Golkonda Fort: గోల్కోండ కోట నుండి సెవన్ టూంబ్స్ వరకు స్కై కేబుల్
Survey on Sky Cable in Golkonda Fort: తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో స్కైకేబుల్, కేబుల్ బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గోల్కొండలో స్కైకేబుల్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గొల్కొండ కోట నుండి సెవెన్ టూంబ్స్ వరకు స్కైకేబుల్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం హెచ్ఎండీఏ అధికారులు సర్వేను నిర్వహించారు. గోల్కోండ కోట నుండి పనులను నిర్వహణ చేపట్టనున్నారు. గోల్కొండ కోట నుండి సెవెన్ టూంబ్స్ వరకు స్కైకేబుల్ ఏర్పాటు కోసం పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఉప్పల్ చౌరస్తాలో స్కైకేబుల్‌ను విజయవంతంగా ఏర్పాటు చేశారు.
స్కై కేబుల్ నిర్వహణ కోసం పెద్ద మొత్తంలో నిధులను వెచ్చిందుకు హెచ్ఎండీఏ అధికారులు సిద్ధమౌతున్నారు. దుర్గం చెరువుపై ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జి పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. నిత్యం వందలాది మంది పర్యాటకులు కేబుల్ బ్రిడ్జిని సందర్శిస్తున్నారు. హైదరాబాద్‌కు కేబుల్ బ్రిడ్జి ఐకాన్‌గా నిలిచింది. కాగా, ఇప్పుడు పర్యాటకంగా ఆకట్టుకునే విధంగా స్కైకేబుల్‌ను ఏర్పాటు చేయనున్నారు. వీలైనంత త్వరగా సర్వేను పూర్తిచేసి స్కైకేబుల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గోల్కొండతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా స్కైకేబుల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.