Hyderabad: 16 మందిపై దాడి చేసిన వీధి కుక్క
Hyderabad: కొద్దిరోజల రోజుల కిందట అంబర్‌పేటలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్.. కుక్కల దాడిలో చనిపోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం అందరికి గుర్తే ఉంటుంది. ఆతర్వాత ప్రభుత్వం స్పందించి కుక్కలబెడద తప్పిస్తామంటూ హామీలిచ్చారు. కానీ ఆ హామీలు అమలుకుమాత్రం చోటుచేసుకోలేదు. అక్కడక్కడా ఈ కుక్కల బెడద తప్పడంలేదు. తాజాగా ఓ వీధికుక్క అడ్డొచ్చినవారందరిని కరిచి హాస్పటల్ పాలుచేసింది.
హైదరాబాద్ లో వీధి కుక్కల బెడద పెరిగిపోతోంది. వీధుల్లో, ప్రధాన రహదారుల్లో గుంపులుగా తిరుగుతూ జనంపై దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ బాలానగర్ లో ఓ వీధి కుక్క స్వైర విహారం చేసింది. వినాయక నగర్ లో ఓ వీధి కుక్క.. పదహారు మందిపై దాడి చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై ఎగబడి కరిచింది. గాయపడిన వారిలో మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. క్షతగాత్రుల్లో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు కూకట్ పల్లి జోన్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది.. అక్కడికి చేరుకుని దాదాపు 2 గంటలపాటు శ్రమించి కుక్కను పట్టుకున్నారు. కుక్కల బెడద ఉందని ఎన్నోసార్లు మున్సిపల్ సిబ్బందికి చెప్పిన పాటించుకోవడంలేదని స్థానికులు చెపుతున్నారు.