China Manja: చైనా మాంజా ఎంత ప్రమాదకరమో తెలుసా?
China Manja Tension: సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేసేందుకు చిన్నా పెద్దా తేడా లేకుండా ఆసక్తి చూపుతారన్న సంగతి తెలిసిందే. అయితే పతంగులు ఎగురవేసేందుకు ఎక్కడెక్కడి నుంచో పతంగులు, వాటికి వాడే దారాలు(మాంజా)లు తెప్పిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు దృఢంగా ఉండే చైనా మాంజా విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్‌తో తయారుచేసిన ఈ మాంజా చుట్టుకుని పక్షులు, మూగజీవాలతో పాటు మనుషులు సైతం ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చైనా మాంజా నిషేధించింది. చైనా మాంజా విక్రయిస్తూ పట్టుబడితే రూ. లక్ష జరిమానా, జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. పోలీసు శాఖ అధికారులు తరుచుగా దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నా వ్యాపారులు అధికారుల కళ్లు కప్పి విక్రయాలు సాగిస్తున్నారు. తాజాగా మాంజా అమ్మకందారులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చైనా మాంజా అమ్ముతున్న షాపులపై సోదాలు నిర్వహించారు. రాచకొండ పరిధిలో విస్తృతంగా సోదాలు చేసిన అధికారులు చైనా మాంజా అమ్ముతున్న నలుగురిపై కేసు నమోదు చేశారు. మరోపక్క మీర్ పేట్ పోలీసులు