Sky Walk: మెహదీపట్నం స్కై వాక్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
Sky Walk work in Mehdipatnam is going very Fast
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది. ఫ్లై ఓవర్ల నిర్మాణం గత కొన్నేళ్లలో శర వేగంగా జరిగాయి. తాజాగా మెహదీపట్నంలో చేపట్టిన స్కై వాక్ నిర్మాణం కూడా నగర వాసులకు ఎంతగానో ఉపయోగపడనుంది. మెహదీపట్నంలో ఉండే తీవ్ర రద్దీను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం స్కై వాక్ నిర్మాణం చేపట్టాలని భావించింది.
అభివృద్ధి చెందిన దేశాల్లో అమలు జరుగుతున్న స్కై వాక్ విధానాన్ని పరిశీలించింది. అదే విధానం హైదరాబాద్ నగరంలో కూడా అమలు చేయాలని నిర్ణయించింది.
మెహదీపట్నం ప్రాంతంలో పలు చోట్ల పాదచారులు ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ సర్కార్ స్కై వాక్ నిర్మాణానికి పూనుకుంది.390 మీటర్ల పొడవైన స్కై వాక్ నిర్మాణం చేపట్టడం ద్వారా అనేక మంది పాదచారులకు ఊరట లభించనుంది.మొత్తం 11 ఎలివేటర్లను ఏర్పాటు చేస్తున్నారు.
మెహదీపట్నంలో రద్దీగా ఉండే ఐదు ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో స్కై వాక్ ఏర్పాటు చేస్తున్నారు. రైతు బజార్, డిఫెన్స్ కాంపౌండ్ వాల్, మెహదీపట్నం బస్ బే ఏరియా, ఆసిఫ్ నగర్ పోలీసు స్టేషన్, గుడిమల్కాపుర్ జంక్షన్ తదితర ప్రాంతాల్లో స్కై వాక్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాద మే నాటికి నిర్మాణం పూర్తి కానుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ఈ స్కై వాక్ నిర్మాణం చేపడుతోంది. 32.97 కోట్లతో స్కై వాక్ నిర్మాణం పూర్తికానుంది.
మెహదీపట్నలంలో స్కై వాక్ నిర్మాణం పూర్తయితే పాదచారులకు ఊరట కలగడంతో పాటుగా అటువైపు వెళుతున్న వాహనదారులకు కూడా ఊరట కలగనుంది. ప్రస్తుతం అక్కడ నెలకన్న రద్దీ కారణంగా ఓ వైపు పాదచారులు, మరోవైపు వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మే నెల నుంచి ఇరువురికి ఊరట కలగనుంది. సాధారణ పాదచారులతో పాటు వికలాంగులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలివేటర్ కుర్చీలను కూడా ఏర్పాటు చేయనున్నారు.
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఉప్పల్ స్కై వాక్
ఉప్పల్ ప్రాంతంలో ఓ స్కై వాక్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. నాగోల్ మెట్రో స్టేషన్ రోడ్డుకు దగ్గర్లో ఈ స్కై వాక్ నిర్మాణం జరిగింది. రామాంతపుర్ రోడ్డువైపు వెళ్లే మార్గం, GHMC థీమ్ పార్క్ వైపు వెళ్లే మార్గం, వరంగల్ బస్సు హాల్ట్ తదితర మార్గాలవైపు వెళ్లే పాదచారులకు ఉప్పల్ స్కై వాక్ ఎంతో ఊటర కలగనుది. రోడ్డుపై ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా ఉండడంతో పాటు, రోడ్డు ప్రమాదాలు కూడా జరగకుండా ఉండేందుకు ఈ స్కై వాక్ ఎంతగానో ఉపయోగపడనుంది.