గత కొంత కాలంగా భయపడుతున్న ఎమ్మెల్యేలకు ఊరట కలిగించే మాట చెప్పారు అధినేత కేసీఆర్. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఊరట కలిగింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలా మందికి టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదని జరుగుతున్న ప్రచారానికి అధినేత కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారు.
Sitting MLAs will get tickets in the coming assembly election, KCR assures
గత కొంత కాలంగా భయపడుతున్న ఎమ్మెల్యేలకు ఊరట కలిగించే మాట చెప్పారు అధినేత కేసీఆర్. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఊరట కలిగింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలా మందికి టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదని జరుగుతున్న ప్రచారానికి అధినేత కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారు.
21 రోజులు ప్రజల్లోనే ఉండాలి
ప్రజల్లోకి వెళ్లకుండా పై పై ప్రచారాలు పక్కన పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. పథకాల ప్రచారంపై ఫోకస్ చేయండని ఆదేశించారు. 21 రోజులు ప్రతీ ఎమ్మెల్యే ప్రజల్లోనే ఉండాలని ఆదేశించారు. పార్టీ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరును గమనిస్తూనే ఉందని అధినేత కేసీఆర్ గుర్తుచేశారు.
కర్ణాటక ప్రభావం తెలంగాణలో ఉండదు
దేశానికి ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని సీఎం కేసీఆర్ ఆరోపించారు. కర్ణాటకలో ఎవరు గెలిచినా పెద్ద విషయం కాదని, తెలంగాణలో ఆ ప్రభావం ఉండదని తేల్చిపారేశారు.
ఆరు నెలల్లో ఎన్నికలు
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నిలకు సిద్ధమవ్వాలంటూ పార్టీ కేడర్‌కు సూచించారు. 6 నెలల్లో ఎన్నికలు జరుగుతాయని.. సిద్ధం కావాలంటూ పార్టీ నాయకులను అప్రమత్తం చేశారు.