TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో సంచలన నిజాలు, ప్రవీణ్ చేతిలో మరికొన్ని ప్రశ్నాపత్నాలు
SIT investigating TSPSC Paper leak Case
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న సిట్ అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. మొత్తం ఐదు పేపర్లను కంప్యూటర్ నుంచి ప్రవీణ్ కొట్టేసినట్లు సిట్ అధికారులు కనిపెట్టారు. టీఎస్పీఎస్సీ అధికారులతో భేటీ అయిన సిట్ చీఫ్ అనేక విషయాలను విచారించారు.
లక్ష్మి దగ్గర నుంచి పాస్వర్డ్ ను ఎప్పుడు చోరీ చేశారన్న దానిపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ కి లబ్ధి చేకూర్చేందుకు కంప్యూటర్ లాన్ లో టీఎస్పీఎస్సీ ఉద్యోగి రాజశేఖర్..పలు మార్పులు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. రాజశేఖర్ సహాయంతో ప్రవీణ్ పేపర్లను కొట్టేసినట్లు నిర్ధారించారు. తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ లో ప్రవీణ్ పేపర్స్ ని సేవ్ చేసుకున్నట్లు సిట్ అధికారులు తేల్చారు.
ఐదవ తేదీన జరిగిన ఏఈ ఎగ్జామ్ పేపర్ తో పాటు మరికొన్ని పేపర్లను ప్రవీణ్ కొట్టేసినట్లు గుర్తించారు. 12వ తేదీన జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష పేపర్లను కూడా ప్రవీణ్ కొట్టేసినట్లు అధికారులు గుర్తించారు. భవిష్యత్తులో జరిగిపోయే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ పోస్టుల పేపర్లను ప్రవీణ్ తన దగ్గర పెట్టుకున్నట్లు సిట్ అధికారులు కనుగొన్నారు. సమయం చూసి పేపర్లను విక్రయించాలని ప్రవీణ్ ప్లాన్ చేసినట్లు
భవిష్యత్తులో జరగబోయే పేపర్లు అన్ని ఇస్తానని రేణుకకు ప్రవీణ్ ఒక హామీ ఇచ్చినట్లు కూడా అధికారులు గుర్తించారు. భవిష్యత్తులో రాయబోయే అభ్యర్థులను వెతికి బేరం మాట్లాడి పెట్టాలని రేణుకకు ప్రవీణ్ చెప్పినట్లు పోలీసులు గుర్తించారు.