తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనని ఆంధ్రా వ్యక్తి అని రేవంత్ రెడ్డి అన్న మాటలకు షర్మిల గట్టిగా కౌంటర్ ఇచ్చారు. నాది ఆంధ్ర అయితే..మరి సోనియా గాంధీ ఎక్కడ..? అని ప్రశ్నించారు. మీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇటలీ కదా అని గుర్తుచేశారు.
Sharmila counter attack on Revanth reddy
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనని ఆంధ్రా వ్యక్తి అని రేవంత్ రెడ్డి అన్న మాటలకు షర్మిల గట్టిగా కౌంటర్ ఇచ్చారు. నాది ఆంధ్ర అయితే..మరి సోనియా గాంధీ ఎక్కడ..? అని ప్రశ్నించారు. మీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇటలీ కదా అని గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డికి సంస్కారం లేదు – షర్మిల
ఒక ప్రాంతాన్ని వదిలేసి, సొంత వాళ్ళను కాదనుకొని… పెళ్లి చేసుకున్నందుకు ..బిడ్డలను కనీ తనని తానే అంకితం చేస్తుంది మహిళ అని షర్మిల మహిళ గొప్పతనాన్ని వివరించారు. ఇది మన దేశ సంస్కృతి , గొప్పదనం అని రేవంత్ రెడ్డికి తెలియజేశారు. ఇంత గొప్ప సంస్కృతిని అర్థం చేసుకోవాడానికి సంస్కారం ఉండాలని షర్మిల రేవంత్ రెడ్డికి చురకలు అంటించారు. ఇంతటి సంస్కారం రేవంత్ రెడ్డికి లేదని షర్మిల విమర్శించారు.నాకు చీర, సారే పెడతాడట… కానీ ఇక్కడ రాజకీయాలు చేయొద్ధట అని షర్మిల మండిపడ్డారు.
ఈ లెక్కన సోనియా గాంధీకి చీర, సారే పెడతాం ..రాజకీయాలు చేయొద్దని రేవంత్ రెడ్డికి చెప్పే దమ్ముందా అని సవాలు విసిరారు. రేవంత్ రెడ్డి అభద్రతగా ఫీల్ అవుతున్నాడని షర్మిల విమర్శించారు. తన వల్ల రేవంత్ రెడ్డి ఉనికి ఎక్కడ పోతుందో అని భయం పట్టుకుందని షర్మిల అన్నారు. అందుకే రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడని షర్మిల కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణలో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్టీ
తెలంగాణలో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్టీపీ అని షర్మిల గర్వంగా తెలిపారు. తెలంగాణ అనే పదం ఉన్న పార్టీ YSRTP అని రేవంత్ రెడ్డికి గుర్తుచేశారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్న ఏకైక పార్టీ YSRTP అని గుర్తుచేశారు. జై తెలంగాణ అనే దమ్ము ఉన్నది వైఎస్ షర్మిలకు మాత్రమేనని స్పష్టం చేశారు. జై తెలంగాణ అనే పదం రేవంత్ రెడ్డికి, కేసీఆర్కు, మోడీకి ,సోనియా కు అనే హక్కు లేదని షర్మిల అన్నారు. రేవంత్ రెడ్డి అల్లుడు కూడా ఆంధ్రా అట ముందు ఆ సంగతి ఏంటో చూడు రేవంత్ రెడ్డి అని షర్మిల చురకలు అంటించారు.