Musi River:ఉగృరూపం దాల్చిన మూసీ.. ఇళ్లలోకి వరద నీరు
Musi Reservoir as Danger: గత 15 రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు మాత్రమే ఎండ కొడుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీకి భారీ వరద వస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ పరిధిలో కురిసిన భారీ వర్షంతో ఇటు హిమాయత్ సాగర్‌కు కూడా వరద పోటెత్తుతోంది. దీంతో నగర శివార్లోని జంట జలాశయాలకు వరద ఉధృతి కొనసాగుతోంది. జలమండలి అధికారులు హిమాయత్ సాగర్ నుంచి మూసీకి నీటివి వదులుతున్నారు.
మరోవైపు మూసీకి నీటిని విడుదల చేయడంతో నగరంలోని మూసీ పరివాహక ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వరదలతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. రాత్రి 11 గంటల నుంచి ఇప్పటి వరకు మూసీ నదిలో భారీగా నీరు ప్రవహిస్తుండటంతో పక్కనే ఉన్న చాదర్‌ఘాట్, శంకర్ నగర్, కమల్ నగర్, మూసా నగర్ తదితర ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. ఇళ్లన్ని నీటిలో మునిగిపోయాయి. ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలోపలే ఉన్నారు. మరియు టెర్రస్‌పై ఉండటంతో వారు బయటకు రాలేకపోతున్నారు.