వేసవి సెలవులు మరి కొద్దీ రోజుల్లో ముగియనున్నాయి. ఇది వేసవి సెలవులు ముగియకముందే చాల స్కూల్స్ లో అడ్మిషన్స్ అయిపోయాయని బోర్డులు పెట్టేశాయి.
School fees: వేసవి సెలవులు మరి కొద్దీ రోజుల్లో ముగియనున్నాయి. ఇది వేసవి సెలవులు ముగియకముందే చాల స్కూల్స్ లో అడ్మిషన్స్ అయిపోయాయని బోర్డులు పెట్టేశాయి. ఇక స్కూల్, కళాశాలల హడావిడి మొదలైంది. పిల్లలను చదివించే తల్లి దండ్రులు ఇక ఫీజులు, ఇతరత్రా ఖర్చులపై దృష్టిపెట్టారు. ప్రస్తుత సమాజంలో చదువు కూడా వ్యాపారంగా మారిపోయిన విషయం అందరికి తెలిసిందే. వచ్చే రాబడి, చేసే ఖర్చులు, అన్ని బేరీజు వేసుకొని కాస్త స్థోమత కలిగిన వారు కార్పొరేట్ సంస్థల వైపు, పేదవారు సర్కారీ స్కూల్ ల వైపు పరుగులుతీస్తారు. పిల్లలను మంచిగా చదివిద్దామనుకున్న తల్లిదండులకు పీజుల మోత తో తలలు పట్టుకుంటున్నారు. ఎల్కేజీ, యూకేజీలకే లక్షల్లో పీజులు లాగుతున్నారు.
ఇక మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి చెప్పలేనిది. అటు వెళ్తే బోలెడు ఫీజులు.. ఇటు వెళ్తే ప్రభుత్వ బడులు పర్వాలేదు అనిపించినా.. చివరికి కార్పొరేట్ వలలో చిక్కుకుపోతున్నారు. అదే ఆ సంస్థల మాయాజాలం. అప్పులు చేసి మరి జాయిన్ చేస్తారు. జరుగుతున్న పరిణామాలు అందరికి తెలిసిన ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోదు. అందులో భాగంగానే ఫీజుల నియంత్రణపై ఇప్పటికే ఈ కమిటీ పలుమార్లు సమావేశమైంది. గతంలో ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదికపై ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజులపై చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ప్రతి ఏటా 10 శాతం ఫీజు పెంచుకోవచ్చనే ప్రతిపాదన చేసింది. ఫీజుల వివరాలను ప్రజలకు తెలిసేలా చర్యలు చేపట్టాలని సూచించింది. అయితే విద్యాసంవత్సరం ప్రారంభం కావొస్తున్నా ఇంతవరకూ ఫీజుల నియంత్రణ చట్టంపై స్పష్టతే లేదు. ఫీజులు ఎంత వసూలు చేయాలో? లేదో? అనేదానిపై స్పష్టమైన తిరుపతిరావు కమిటీ మార్గదర్శకాలు ఏవని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ప్రైవేట్ స్కూళ్లు గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే 10 నుంచి 30 శాతం ఫీజులు పెంచేశాయని సమాచారం. ప్రైవేటు, కార్పొరేటు యాజమాన్యాలను నియంత్రించాల్సిన రాష్ట్ర సర్కారు.. కమిటీలు, సమీక్షల పేరుతో కాలయాపన చేస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓకే ఇంట్లో ఇద్దరు పిల్లలను కార్పొరేట్ స్కూళ్లల్లో చదివిస్తే ఒకరికి లక్ష ముట్టచెప్పాల్సిందే అంటే ఇద్దరికీ రెండు లక్షలు ..ఇదే సమయంలో డొనేషన్లు, ఇతర ఫీజుల పేరుతో ప్రైవేటు స్కూళ్లు అందిన కాడికి దోచుకుంటున్నాయి .విద్యార్థుల తల్లిదండ్రులను అప్పులపాలయేలా చేస్తున్నాయి. రాష్ట్రంలోని 10,700 కార్పొరేట్ స్కూళ్లలో 30 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో స్కూల్ స్థాయిని బట్టి ఏటా రూ.20 వేల నుంచి రూ.5 లక్షల దాకా ఫీజులు వసూలు చేస్తున్నారు. టెక్ట్స్ బుక్స్, యూనిఫామ్స్, నోట్ బుక్స్, షూస్, బస్ ఫీజులు.. ఇవన్నీ అదనం. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలనే డిమాండ్ చాలా ఏండ్ల నుంచి ఉంది. అయినా సర్కారులో మాత్రం చలనం రావట్లేదు. కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేకున్నా ఫీజులు భారీగా వసూలు చేస్తున్నారు. మేనేజ్మెంట్లు ఏ లెక్కన అంతమొత్తం వసూలు చేస్తున్నాయనే క్లారిటీ అధికారులకూ లేదు. మరోపక్క పుస్తకాలు, బూట్లు, బ్యాగులు, యూనిఫామ్.. ఇలా అన్ని బడుల్లోనే కొనాల్సి వస్తోంది. బడుల్లో వ్యాపారాలు చేయొద్దనే ఆదేశాలనూ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు.
పీజులు కట్టాలా..? లేక చదువులకోసం తీసుకొచ్చిన అప్పులు కట్టాలా..? అనే ఆలోచనలో పడ్డారు తల్లిదండ్రులు. కరోనా తో ఆర్థికనగా దెబ్బతిన్న సామాన్య మానవులకు ఈ ప్రవైట్ స్కూళ్లల్లో చదివిద్దామనుకుంటే ఫీజులభారం వారికీ గుదిబండగా మారింది. ఈ విద్యా సంవత్సరం ఫీజులకు సంబంధించి ఇప్పటికే తల్లిదండ్రులకు చాలా స్కూల్స్ వివరాలు అందించాయి. మిగతా స్కూల్స్ కూడా ఈ విద్యా ఫీజుల విధానాన్ని ప్రకటించబోతున్నాయి. ఈ విషయంపై కొందరు తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాల్ని ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ ప్రయోజనం ఉండటం లేదు. ఇక్కడ మారాల్సింది ప్రభుత్వ అధికారులు.. రాజకీయనాయకుల ధోరణి. భావిబారత పౌరులుగా మన యువతను సరైన మార్గంలో పెట్టాలంటే విద్య చాలా అవసరం. ఇందుకోసం ప్రభుత్వమే సరైన చొరవ తీసుకోవాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.