Sathwik Suicide Case: కన్నీరు పెట్టిస్తున్న సాత్విక్ సూసైడ్ లెటర్
Sathwik Suicide Case: హైదరాబాద్ నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీ సిబ్బంది వేధింపులతో విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపగా ఈ అంశం మీద ప్రభుత్వం సీరియస్ అయింది. సాత్విక్ అంశంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారణకు ఆదేశించగా ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్‌ను కోరారు. విచారణలో దోషలుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుంటామని ఆమె అన్నారు. ఇక తాజాగా సాత్విక్ సూసైడ్ లెటర్ బయిటకు వచ్చింది. అమ్మానాన్న నేను ఈ పని చేస్తున్నందుకు క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టాలని ఉద్దేశం నాకు లేదు కానీ కళాశాలలో ప్రిన్సిపల్ కళాశాల ఇంచార్జ్, లెక్చరర్ పెట్టే టార్చర్ వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నానుని పేర్కొన్నాడు. కృష్ణారెడ్డి ,ఆచార్య, శోభన్, నరేష్ వేధింపు లకు తట్టుకోలేక పోయానని, నేను ఉంటున్న హాస్టల్లో వీరు ముగ్గురు కలిసి విద్యార్థులకు నరకం చూపిస్తున్నారని పేర్కొన్నారు. వీరి వేధింపులు తట్టుకోలేకనే నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను, నన్ను వేధించిన ఈ ముగ్గురిపై యాక్షన్ తీసుకోండని కోరాడు. అమ్మానాన్న లవ్ యు , మిస్ యూ ఫ్రెండ్స్