Sankranti Rush In Toll Plazas: పల్లెబాటకి పట్నం.. టోల్‌గేట్లవద్ద భారీగా ట్రాఫిక్ జామ్
Sankranti Rush In Toll Plazas: సంక్రాంతి వచ్చిందంటే చాలు చాలు హైదరాబాద్ నగరం ఖాళీ అవుతుంది. దాదాపు 65 % మంది సొంతూళ్లకు పయనమవుతారు. తెలుగు ప్రజలు జరుపుకునే పండగల్లో అతి పెద్ద పండగ సంక్రాంతి. తెలంగాణ లో కంటే ఆంధ్ర ప్రదేశ్ లో ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరే సంక్రాంతి పండగకు వారి సొంత ఊరికి వచ్చి కుటుంబ సభ్యులతో గ్రామస్థులతో పండగను జరుపుకుంటారు. పారిశ్రామిక వేత్తలనుండి సామాన్య ప్రజానీకం వరకు ఇలా అంత కూడా తమ ఫ్యామిలీ సభ్యులతో ఘనంగా ఓ వారం పాటు ఘనంగా జరుపుకుంటారు. ఇది మూడు రోజులు జరుపుకునే ముచ్చటైన పండగ
ఇక ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. స్కూల్స్ , కాలేజీలకు సెలవులు ఇవ్వడం తో సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో అన్ని టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అధికమైంది. ఈనేపథ్యంలో చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా, హైదరాబాద్ -కరీంనగర్ రేణుగుంట టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. అయితే టోల్‌గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా అధికారులు ముందుగానే చర్యలు తీసుకున్నారు.
టోల్ బూత్‌లలో రెండు సెకన్లకే వాహనాలు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసిన వాహనాలు భారీగా రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జోన్, బ్లాక్ స్పాట్‌ల వద్ద అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. 24 గంటలపాటు హైవేపై గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. పలు టోల్‌ప్లాజాల వద్ద పటిష్ట చర్యలు చేపట్టారు.