Shilparamam: శిల్పారామానికి క్యూ కట్టిన జనం
Shilparamam:హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపాన మాదాపూర్‌లోని శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న సంక్రాంతి సంబురాలలో భాగంగా ఆదివారం గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు, బుడబుక్కల, జంగమదేవరా గారడీ వేషాలతో చిన్నారులను ఆకట్టుకున్నారు.
పల్లె వాతావరణంతో అక్కడ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గంగిరెద్దులు విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు స్పెషల్ అట్రాక్షన్గానిలిచాయి. భోగిపళ్ల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆంఫిథియేటర్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శిల్పారామం లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న పెద్దలు చిన్నారులకు ప్రతి ఒక అంశాన్ని వివరించారు. మన సంస్కృతి సంప్రదాయాలగురించి ఇప్పటి తరం వారికీ ఏమి అవగాహనా ఉండదు కాబట్టి అక్కడకు వచ్చిన పెద్దవారు వారి వారి మనుమలు, మానవరాళ్లకు, సంక్రాంతి గురించి వివరించారు.
శిల్పారామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో నగర ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో ఆదివారం శిల్పారామానికి వచ్చే రహదారులన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి. శిల్పారామానికి వచ్చి వెళ్లే రూట్లలో కిలో మీటరు కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. టాఫిక్ అధికారులు ట్రాఫిక్ ను చక్కదిద్దారు.