Sania Mirza Farewell Match: ఫేర్ వెల్ మ్యాచ్ లో విజయం, సానియా మీర్జా భావోద్వేగం
Sania Mirza became emotional in Farewell Match in LB Stadium
భారత టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా భావోద్వేగానికి లోనయింది. హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన ఫేర్ వెల్ మ్యాచ్ లో విజయం సాధించింది. అనంతరం భావోద్వేగానికి లోనయింది. కంటతడి పెట్టుకుంది. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మ్యాచ్ సానియాకు చిరస్మరణీయంగా ఉండాలని నిర్వాహకులు భావించారు. తల్లిదండ్రులు, స్నేహితులు, అభిమానులు, ప్రముఖులు ఎందరినో ఆహ్వానించారు. ప్రఖ్యాత రేపర్ స్టాన్, హీరో దుల్ఖార్ సల్మాన్, అజారుద్దీన్, యువరాజ్ సింగ్ తదితరులు ఆ క్షణాలను చూసేందుకు తరలి వచ్చారు.
చిరకాల స్నేహితురాలై మరో టెన్నిస్ గ్రేట్ మరియన్ బార్టోలీ కూడా హైదరాబాద్ నగరానికి విచ్చేసింది. సానియా మీర్జా వీడ్కోలు మ్యాచ్ చూసేందుకు ఎల్బీ స్టేడియం చేరుకుంది. రోహన్ బోపన్న, సారా బ్లాంక్ తదితరులు కూడా ఎల్బీ స్టేడియానికి తరలి వచ్చారు. బాలీవుడ్ తారలు కూడా సానియా మీర్జాకు వీడ్కోలు చెప్పేందుకు ఎల్బీ స్టేడియానికి వచ్చారు. ఫరాఖాన్, హుమా ఖురేషీ వంటి బాలీవుడ్ స్టార్లు స్టేడియంలో సందడి చేశారు. సోనియా మీర్జా తన 20 ఏళ్ల కెరీర్లో 43 WTA టైటిల్స్ సాధించింది. చాలా వారాల పాటు మిక్స్ డ్ విభాగంలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది.
@Dulquer Latest From #SaniaMirza farewell match in Hyderabad 💙✨
Fireee🔥🔥#DulquerSalmaan #KingOfKotha pic.twitter.com/RiebKyuZoU— alexander glmy (@Sufudq) March 5, 2023
.