హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. దేశం నలుమూలల నుంచి ఉద్యోగాల కోసం మొదటి ఛాయిస్ గా హైదరాబాద్ ను ఎంచుకుంటారు. ఎందుకంటే ఇక్కడ లివింగ్ కాస్ట్ తక్కువ మరియు ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ ముందంజలోఉంది.
Rumble Stripes: హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. దేశం నలుమూలల నుంచి ఉద్యోగాల కోసం మొదటి ఛాయిస్ గా హైదరాబాద్ ను ఎంచుకుంటారు. ఎందుకంటే ఇక్కడ లివింగ్ కాస్ట్ తక్కువ మరియు ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ ముందంజలోఉంది. కాబట్టి ఎక్కువగా దేశ ప్రజలు హైదరాబాద్ కు వస్తుంటారు. ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రాక్చర్ చూసి.. విదేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ పెడుతున్నారు. దీంతో.. హైటెక్ సిటీ నుండి ఉప్పల్ వరకు ట్రాఫిక్ సమస్య వెంటాడుతూనే ఉంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే.. పెద్ద ఎత్తున ఫైఓవర్లు కడుతున్నారు. విశాలమైన రోడ్లు వేస్తున్నారు. ఔటర్ రింగు రోడ్లు కూడా వేస్తున్నారు.ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ రోడ్లు నగరవాసులకు మాత్రం శాపంగా మారుతున్నాయి. అవును రంబుల్ స్ట్రిప్స్ వల్ల ప్రయాణికులకు అవస్థలు ఎదురవరున్నాయి.
రోడ్లపై అక్కడక్కడా.. ఈ రంబుల్ స్ట్రిప్స్ ఉండటం గమనిస్తూనే ఉంటాం. అయితే.. ఈ రంబుల్ స్ట్రిప్స్.. రోడ్డుపై ప్రమాద స్థలానికి ముందు.. లేదా ఫ్లైఓవర్‌కు ఇరువైపులా.. లేదా జంక్షన్ సమీపంలో, టర్నింగ్‌కు ముందు వెనుక , హైవేలపై చాలా ప్రదేశాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఏర్పాటు చేశారు. అయితే.. నగరంలో రద్దీ ప్రదేశాలు ఉండటం అలాగే చాలా వరకు జంక్షన్లు ఉండటంతో ఈ రంబుల్ స్ట్రిప్స్‌ని చాలా చోట్ల ఏర్పాటు చేశారు. ఈ రంబుల్ స్ట్రిప్స్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఇవి నాలుగు నుంచి ఐదు లైన్లు ఉంటే పర్లేదు కానీ.. పది నుంచి పదిహేను వరకు ఉంటుండటంతో వానదారులకు రంబుల్ స్ట్రిప్స్ అంటేనే వెన్ను వణుకుతుంది. పదే పదే స్పీడ్ బ్రేకర్లు వేస్తే ప్రయాణికులకు ఇబ్బంది అనే కారణంతో వాటికంటే ఎత్తు తక్కువగా ఉండే రంబుల్ స్ట్రిప్స్ వాడకం ఇటీవల పెరిగింది. మితి మీరిన వేగాన్ని అదుపు చేయడంకోసమే వీటిని రోడ్లపై వేసేవారు. వాస్తవానికి వీటి వల్ల వాహనాల వేగం తగ్గి, ప్రయాణం సాఫీగా సాగాలి. కానీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో వేసిన రంబుల్ స్ట్రిప్స్ వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక వీటివల్ల వాహనదారుడి వేగం కొంత తగ్గినా పరవాలేదు కానీ పది పదిహేను రంబుల్ స్ట్రిప్స్ లైన్స్ వల్ల వాహనదారులకు వెన్నుపూసలదురుతున్నాయని వాపోతున్నారు. ఇక అర్ధరాత్రి ప్రయాణం చేసే సమయంలో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులకు ఈ రంబుల్ స్ట్రిప్స్ నిద్రలేకుండా చేస్తుంది.. రంబుల్ స్ట్రిప్స్పైకి వాహనం వెళ్ళగానే కాస్త కుదుపులకు లోనవుతుంది దీనివల్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక ఇవి హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ఉన్నాయి. ఎల్ బి నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, మేడ్చల్, కూకట్ పల్లి, జె ఎన్‌టియు, మియాపూర్, హైటెక్ సిటీ ,కొండాపూర్ గచ్చిబౌలి, టీ హాబ్, రాయదుర్గం రోడ్లలో వీటి బెడద ఎక్కువగా ఉండటంతో.. ఆ రూట్లలో వెళ్లే వాళ్లకు మరింత సమస్య ఝటిలమవుతుంది.
ముఖ్యంగా టీఎస్ఐఐసి ప్రాంతంలో వేసిన రంబుల్‌స్ట్రిప్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. 5 మిల్లీమీటర్ల మందం ఉండాలనే నిబంధనలు ఉండగా నగరంలో ఏకంగా 10నుంచి 15మిల్లీమీటర్ల మందంతో వాటిని వేశారని, మధ్యలో ఉన్న గ్యాప్ కూడా చాలా తక్కువగా ఉందని, దీనివల్ల ఆ రూటులో వెళ్లే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారనే ఫిర్యాదులొచ్చాయి. కొంతమంది నేరుగా మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్లో ఫిర్యాదులు చేశారు. ఈ రంబుల్ స్ట్రిప్స్‌ని తొలగించాల్సిన ఆవశ్యకత చాలా ఉందని.. ఇది కేవలం ఒక ప్రాంతంలోనే కాదు.. హైదరాబాద్ నగరమంతా ఉందని వివరించారు. వీటి వల్ల నగరవాసులు.. వెన్ను సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొన్నాడు. కేటీఆర్ ఈ సమస్యపై దృష్టి సారించాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశాడు. దీనిపై నెట్టింట చాలా మంది ఈ సమస్యపై స్పందించారు. రంబుల్ స్ట్రిప్స్ ఎత్తు తగ్గించి.. సురక్షిత ప్రయాణం చేసేలా చూడాలని గొంతు కలిపారు. పిర్యాదులు వెల్లువెత్తడంతో కేటీఆర్ వెంటనే స్పందించి అధికారుల్ని అలర్ట్ చేసారు. మంత్రి కేటీఆర్ రంబుల్ స్ట్రిప్ లో మార్పులు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, ఇంజనీరింగ్ చీఫ్ కి సూచనలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వేసిన చోట రంబుల్ స్ట్రిప్స్ తొలగిస్తున్నారు. కొత్తగా నగరంలో ఇంకెక్కడా వాటిని వేయకూడదని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఈ నిర్ణయంతో హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.