తెలంగాణలో మరోసారి ఆర్టీసీ ఛార్జీల పెంపు
తెలంగాణ ప్రజలకు మరో షాక్ తగిలింది. కొద్దిరోజుల క్రితం రౌండ్ ఫిగర్ చార్జీల పేరుతో బస్ ఛార్జీలు పెంచిన టీఎస్ ఆర్టీసీ మరోసారి టికెట్ ధరలు పెంచింది. పెరుగుతున్న డీజిల్ ధరల భారాన్ని తగ్గించుకునేందుకు డీజిల్ సెస్ పేరుతో ఆ భారాన్ని ప్రయాణికులపై మోపింది. బస్సు సర్వీసుల్లో కనీస టికెట్ ధరను రూ. 10 గా నిర్ణయించింది. ఇక పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులలో టికెట్ రేట్ రూ. 2 పెంచింది. మెట్రో సూపర్ గత నెలలో టోల్ సెస్, టిక్కెట్ ఛార్జీల సవరణ, ప్యాసింజర్ సెస్‌ల పేరుతో సిటీ బస్సుల నుంచి గరుడ ప్లస్ బస్సుల వరకు ఛార్జీలు పెంచిన తెలంగాణ ఆర్టీసీ.. తాజాగా డీజిల్ సెస్ పేరుతో మరో వడ్డన చేపట్టింది. అంతకుముందు సమ్మెలు, ఇతర కారణాల వల్ల మరింత నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీ సంస్థను కరోనా లాక్‌డౌన్, ఆంక్షలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. సజ్జనార్ దాని ఎండీ అయ్యాక దాన్ని లాభాల బాట పట్టించే పనిలో పడ్డారు.