TSPSC: జనార్ధనరెడ్డి గారు..పదవికి రాజీనామా చేయండి – ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar asks TSPSC Chairman to resign from the post
తెలంగాణ పోటీ పరీక్షల లీకేజీ వ్యవహారంపై రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగుతున్నాయి. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ కూడా ఆ జాబితాలో చేరారు. ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్ధనరెడ్డిని టార్గెట్ చేశారు. చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని కోరారు.
పేపర్ లీకేజ్ అన్నది క్షమించరాని నేరమని, పేపర్ల లీకేజీ కారణంగా లక్షలాది నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.జనార్ధన్ రెడ్డి గారితో తనకేమీ వైరం లేదని, ఆయన తనకు యూనివర్సిటీలో సూపర్ సీనియర్ అని ప్రవీణ్ కుమార్ గుర్తుచేసుకున్నారు. గతంలో గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు ఉద్యోగరీత్యా చాలాసార్లు వారిని కలిశానని ప్రవీణ్ కుమార్ గుర్తుచేసుకున్నారు.
పేపర్ల లీకేజీ విషయంలో వార్తలు కవన్ చేయని నమస్తే తెలంగాణ పేపర్లను ఓయూలోని విద్యార్ధులు తగులబెట్టారు. ఈ విషయాన్ని కవర్ చేస్తూ వచ్చిన వార్తల క్లిప్పింగులను కూడా ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.
ఛైర్మన్ డా. జనార్ధనరెడ్డి గారికి,నాకు మద్య వైరమేమి లేదు.ఆయన యూనివర్సిటీలో నాకు సూపర్ సీనియర్.గురుకుల సెక్రెటరీ గా ఉన్నప్పుడు ఉద్యోగరీత్యా చాలాసార్లు వారిని కలిశాను. కానీ #TSPSCLeak is Unpardonable Crime.ఇది లక్షలాది నిరుద్యోగుల భవిష్యత్తును అంధకారంలో పడేసింది. Pl Step Down SIR 🙏 pic.twitter.com/Ppn0Fcg9q1
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 19, 2023
ఇది ఎప్పుడో చేసిండాల్సింది👊 pic.twitter.com/pXzpvG8kcA
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 19, 2023
..