Deccan Mall: ప్రమాద స్థాయిలో దక్కన్‌మాల్ ఎప్పుడైన కూలిపోవచ్చు..
Deccan Mall: నూతన సంవత్సరంలో హైదరాబాద్ లో భయానక సంఘటన అంటే అది దక్కన్ మాల్ అగ్నిప్రమాదమే.. ఈ మాల్ లో ముగ్గురు చిక్కుకునిపోయారని సమాచారం అగ్నిప్రమాదం తర్వాత డ్రోన్ ద్వారా మృతదేహాల ఆనవాళ్ల కోసం ప్రయత్నించినా..ఫస్ట్ ఫ్లోర్‌లో ఒక డెడ్‌బాడీ కి సంబదించిన అవశేషాలు మాత్రమే కనిపించాయి. అక్కడే శిథిలాల కింద మిగిలిన మృతదేహాల ఆనవాళ్లు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. ఐతే ఎంత ప్రయ్నటించిన మిగతావారి ఆనవాళ్లు మాత్రం చిక్కడంలేదు. DRF ఫైర్ సిబ్బంది బిల్డింగ్ అంతా గాలించినా..మృతదేహాల ఆనవాళ్లు లభించకపోవడంతో.. ఇక కూల్చివేతల ప్రక్రియ ప్రారంభించనున్నారు.
ఇప్పటికే పగుళ్లు రావడంతో బిల్డింగ్ ప్రమాదకరంగా మారింది. దీంతో బిల్డింగ్ ఏ క్క్షణంలోనైనా కూలిపోవచ్చు. ఇప్పటికే ఆదారిని మూసివేశారు అధికారులు. బిల్డింగ్ మొదటి రెండు అంతస్తులు కూలి సెల్లార్లో పడ్డాయి. దీంతో అప్రమత్తుమైన అధికారులు ఎవరిని అనుమతించడంలేదు ఆ బిల్డింగ్ వద్దకు. ఇక కూల్చివేతకు ఫైర్ డిపార్ట్‌మెంట్ అనుమతి ఇచ్చింది. మృతదేహాల ఆనవాళ్లు లభించకపోవడంతో.. కూల్చివేతకు అనుమతి ఇచ్చారు. మరోవైపు కూల్చివేతలు చేపట్టే మాలిక్ ఏజెన్సీ ప్రతినిధులు కూడా బిల్డింగ్‌ను పరిశీలించారు. శిథిలాలు చుట్టపక్కల ఇళ్లపై పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక మాల్‌లో 10వేల టన్నుల వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించామన్నారు అధికారులు
బిల్డింగ్ కూల్చివేతకు రోబోటిక్ టెక్నాలజీ వినియోగించాలని నిర్ణయించారు. చుట్టుపక్కల ఇళ్లకు డ్యామేజ్ కాకుండా కూల్చివేతకు చర్యలు చేపట్టారు. కాంబి కటింగ్ మెషీన్‌తో వ్యర్ధాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐరన్ స్లాబ్ గోడల వ్యర్ధాలను కూడా ఇదే యంత్రంతో తొలగించేలా చర్యలు చేపట్టారు అధికారులు. భవనం ముందు భాగంలోని పై ఫ్లోర్ నుంచి కూల్చివేతకు ప్లాన్ రూపొందించారు.