RGV: మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని మరోసారి టార్గెట్ చేసిన రాంగోపాల్ వర్మ
RGV targets Mayor Gadwal Vijaya laxmi
దర్శకుడు రాంగోపాల్ వర్మ జీహెంఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని మరోసారి టార్గెట్ చేశారు. స్వప్పలోక్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే అక్కడకు మేయర్ చేరుకున్నారు. సహాయ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో స్వయంగా పరిశీలించారు. సహాయ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించిన మేయర్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ట్వీట్ చూసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. మేయర్ గారు మీ కుక్కలను కూడా తీసుకువెళ్లారా అంటూ రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు.
Did you take your dogs also ? https://t.co/omADgvDcay
— Ram Gopal Varma (@RGVzoomin) March 17, 2023
అంబర్ పేటలో ఓ బాలుడిని వీధి కుక్కలు వెంబడించి చంపేశాయి. ఈ ఘటన రాంగోపాల్ వర్మను తీవ్రంగా కలిచి వేసింది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం కారణంగానే వీధి కుక్కలు విచ్చలవిడిగా తిరుగు తున్నాయని మండిపడ్డారు. కుక్కలకు ఆహారం దొరక్కపోవడంతో దాడులకు పాల్పడుతున్నాయని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలు రాంగోపాల్ వర్మకు కోపం తెప్పించాయి. అప్పటి నుంచి మేయర్ విజయలక్ష్మిని టార్గెట్ చేస్తున్నారు. ఆమె వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. కనీసం బాలుడి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలని ట్విట్టర్ వేదికగా పోరాటం చేశారు.