RGV: తాతగారూ మీరింకా ఉన్నారా.. వీహెచ్ పై రాంగోపాల్ వర్మ సెటైర్లు
RGV Counter attack on V. Hanumantha Rao
కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావుపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఓ తాతగారూ మీరింకా ఉన్నారా అని ఎద్దేవా చేశారు. తనపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వీహెచ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించారు. NASA యాక్ట్ వర్తించదు TADA యాక్ట్ ని 1995 లోనే తీసేశారు.. ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్ కి ఆ గతి.. ఒక సారి డాక్టర్ కి చూపించుకోండని సలహా ఇచ్చారు.
ఏపీ సీఎంకు వీహెచ్ లేఖ
కొన్ని రోజుల క్రితం దర్శకుడు రాంగోపాల్ వర్మ నాగార్జున యూనివర్సిటీలో ప్రసంగించారు. ఆ సమయంలో ఆర్జీవీ చేసిన కొన్ని వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా సంఘాలు ఆర్జీవీపై విరుచుకుపడ్డాయి. ఆర్జీవీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.
రాంగోపాల్ వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నాగార్జున యూనివర్సిటీలో మహిళలను ఉద్దేశించి రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సరికాదని వీహెచ్ తన లేఖలో పేర్కొన్నారు. ఆర్జవీ వంటి వారిని అలాగే వదిలేస్తే మహిళలను అవమానించడం ఆనవాయితీ మారుతుందని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాంగోపాల్ వర్మకు నిజంగా దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీలోగానీ, కాకతీయ యూనివర్సిటీలోగానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయాలని సవాలు విసిరారు.
నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను సస్సెండ్ చేసి, ఆర్జీవీపై చర్యలు తీసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ నేతృత్వంలో ఆందోళలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఓ తాతగారూ మీరింకా వున్నారా??? https://t.co/iLNuYnFqtw NASA యాక్ట్ వర్తించదు TADA యాక్ట్ ని 1995 లోనే తీసేశారు.. ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్ కి ఆ గతి.. ఒక సారి డాక్టర్ కి చూపించుకొండి😘😘😘 pic.twitter.com/eQAOCkByrh
— Ram Gopal Varma (@RGVzoomin) March 19, 2023