RGV: రాముకి కోపం తెప్పించిన శబ్ధ కాలుష్యం, ఏం జరిగిందంటే..
RGV complaint on Sound Pollution in Jubli Hills Public School
దర్శకుడు రాంగోపాల్ వర్మ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణం నుంచి వస్తున్న సౌండ్ పొల్యూషన్ విషయమై తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులను కోరారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్, హైదరాబాద్ సిటీ పోలీస్ ట్విట్టర్ అకౌంట్లను ట్యాగ్ చేశారు.పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (PA System) ద్వారా వచ్చే శబ్ధ కాలుష్యం కారణంగా విద్యార్ధుల తమ వినికిడి సామర్ధ్యం శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉందని రాంగోపాల్ వర్మ ఆందోళన వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులకు కూడా రాంగోపాల్ వర్మ కొన్ని సూచనలు చేశారు. స్కూల్ ప్రాంగణంలో లౌడ్ స్పీకర్ల ద్వారా వచ్చే సౌండ్ పొల్యూషన్ మీ పిల్లల ఇయర్ డ్రమ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని, వెంటనే డాక్టర్లను సంప్రదించడని సలహా ఇచ్చారు.
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యంపై కూడా రాంగోపాల్ వర్మ ఫైర్ అయ్యారు. స్కూల్ యాజమాన్యానికి మినిమమ్ కామన్ సెన్స్ లేదని విమర్శించారు. విమానాశ్రయాల వద్ద ఉండేంత తీవ్రమైన శబ్ధాలు ఇక్కడ వినిపిస్తున్నాయని మండిపడ్డారు. శబ్ధ కాలుష్యం కారణంగా విద్యార్ధులు చెవిటివాళ్లుగా మారే ప్రమాదం ఉందని రాంగోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.
చివరిగా స్కూల్ లో చదివే విద్యార్ధులకు హితబోధ చేశారు, మీరందరూ చెవిటివాళ్లుగా మారకముందే స్కూల్ టీచర్లపై తిరగబడాలని సూచించారు. విద్యార్ధుల ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పెద్దలు అటువంటి స్కూల్ లో ఉన్నారంటే నమ్మశక్యంగా లేదని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
Hey children of Jubilee Hills public school ,you should REBEL against ur teachers before they make you DEAF ..Demand to place multiple speakers to space the sound.I can’t believe adults in this school are so insensitive to children’s health @CPHydCity @HydCityPolice pic.twitter.com/ypKRItNCy7
— Ram Gopal Varma (@RGVzoomin) January 21, 2023
The Jubilee Hills public school road no.71 ‘s admin should have minimum common sense to have multiple speakers to space out the sound like they do at airports and other places ..Apart from noise pollution they are creating deafness in the poor children @CpHydCity @HydCityPolice pic.twitter.com/9MZ1Zy0iYX
— Ram Gopal Varma (@RGVzoomin) January 21, 2023
Dear parents of Rd 71 Jubilee hills public school children,your kids ear drums will be permanently damaged with such high decibels of sound .check with ur doctors https://t.co/H67glA1iT9 them if u love them
Respected @CPHydCity @HydCityPolice please look into this pic.twitter.com/Ko4jRIa6as— Ram Gopal Varma (@RGVzoomin) January 21, 2023
Action needs to be taken on Rd 71 Jubilee Hills public school Admin for EAR SPLITTING NOISE they create through their P A systems. The poor children’s eardrums will permanently get damaged being nearer to the speakers @CPHydCity @hydcitypolice pic.twitter.com/mOLBUvTNP1
— Ram Gopal Varma (@RGVzoomin) January 21, 2023