GMR: మరో ఘనత సాధించిన శంషాబాద్ విమానాశ్రం
RGIA received the Best Regional Airport in India and South Asia
శంషాబాద్ విమానాశ్రయం మరో ఘనత సాధించింది. దక్షిణాసియాలో బెస్ట్ రీజినల్ ఎయిర్ పోర్టుగా నిలిచింది. ఈ నేపథ్యంలో వరల్డ్ ఎయిర్ పోర్టు అవార్డును శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సొంతం చేసుకుంది. అవార్డు వచ్చిన విషయాన్ని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ సంస్థ ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. బెస్ట్ రీజినల్ ఎయిర్ పోర్టు అవార్డుతో పాటు బెస్టు ఎయిర్ పోర్టు స్టాఫ్ అవార్డు కూడా జీఎంఆర్ సొంతం చేసుకుంది.
జీఎంఆర్ ఎయిర్ పోర్టు సంస్థకు అవార్డు రావడంపై ఆ సంస్థ సీఈఓ ప్రదీప్ పనిక్కర్ సంతోషం వ్యక్తం చేశారు. అవార్డు స్వీకరించడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉందని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్ధం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు ప్రదీప్ తెలిపారు.
ఇటీవలే ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ చేపట్టిన ఎయిర్ సర్వీస్ క్వాలిటీ సర్వేలో కూడా జీఎంఆర్ సంస్థ ప్రశంసలు అందుకుంది. సంవత్సరానికి 15 నుంచి 25 మిలియన్ల ప్రయాణికులు ప్రశాంతంగా ప్రయాణం చేస్తున్నట్లు తెలిపింది.