Revanth Reddy Padayatra: రేవంత్ పాదయాత్ర కోసం రూట్ మ్యాప్ రెడీ
Revanth Reddy Padayatra: తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసేందుకు సిద్దమౌతున్నారు. దాదాపుగా అన్ని సిద్దం చేసుకున్నారు. రూట్ మ్యాప్‌కూడా దాదాపు సిద్ధమైంది. జనవరి 26 నుండి ఈ పాదయాత్ర ప్రారంభం కానున్నది. భద్రాచలంలో శ్రీసీతారామచంద్రుల వారిని దర్శించుకున్నాక యాత్రను ప్రారంభించనున్నారు. భద్రాచలం నుండి ప్రారంభమయ్యి 99 నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లాలో యాత్రను ముగించనున్నారు. హాత్ సే హాత్ జోడో పేరుతో ఈ యాత్రను చేయబోతున్నారు. 126 రోజలపాటు ఈ యాత్ర కొనసాగనున్నది. రోజుకు 18 కిమీ చొప్పున పాదయాత్ర చేపట్టనున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తైనా ఇంకా ఏఐసీసీ నుండి అధికారికంగా ఆమోదం రాలేదని, ఆమోదం రాకుండా పాదయాత్రను చేయలేరని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్తాయి నుండి బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపడుతున్న నేపథ్యంలో తప్పకుండా అనుమతులు వస్తాయని రేవంత్ వర్గీయులు చెబుతున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రకు పొగింపుగా తెలంగాణలో ఈ యాత్రను చేపట్టబోతున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మే నెలాఖరున లేదా జూన్ మొదటివారంలోగా యాత్రను ముగించేలా ప్లాన్ చేశారు. ఈ పాదయాత్రలో సీనియర్లు కొందరు వ్యతిరేకిస్తున్నప్పటీ, అధిష్టానం నుండి ఆమోదం లభిస్తే సీనియర్ నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొనే అవకాశం ఉంటుంది.