Revanth Reddy fires on KCR: ఆ డబ్బంతా బెల్ట్ షాపులకే… ఇదే కేసీఆర్ మోడల్
Revanth Reddy fires on KCR: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్ పల్లిలో ఆయన ఆదివారం రోజున రైతులతో ముఖాముఖిని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో మద్యం ఏరులై పారుతోందని అన్నారు. మద్యం నుండి ఆదాయం భారీగా వస్తోందని విమర్శించారు. తెలంగాణలో ప్రభుత్వం ఇస్తోన్న రైతుబంధు డబ్బుల్నీ బెల్టుషాపులకే వెళ్తున్నాయని విమర్శించారు.
తెలంగాణ మోడల్ అంటే మూడు వేల వైన్ షాపులు, 60 వేల బెల్టు షాపులుగా మారిందని అన్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. తెలంగాణ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తోందని అన్నారు. వరంగల్‌లో తాము రూపొందించిన రైతు డిక్లరేషన్‌ను అక అగ్రిమెంటుగా భావిస్తున్నామని, దానిని తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. రైతుల పరిష్కారం కోసం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకోసం రైతు కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని అన్నారు. పంటల భీమాతో పాటు రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.