Revanth Reddy on Janasena Party: పొత్తులపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Janasena Party: రేవంత్ రెడ్డి తెలంగాణలో హాత్ సే హాత్ జోడో పాదయాత్రను నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్రకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల లోపు మరిన్ని పాదయాత్రలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో తన పాత నియోజకవర్గం కొడంగల్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. సీఎం అభ్యర్థి ఎవరు అన్నది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది. ఇందులో తమ ప్రమేయం ఏమి ఉండబోదని స్పష్టం చేసింది. తెలంగాణలో తాము ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోవడం లేదని స్పష్టం చేసింది.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌పార్టీ వామపక్షాలతో కలిసి పనిచేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలిసి తెలంగాణలో పోటీ చేసింది. మరోసారి టీడీపీతో కలిసి పోటీ చేసే అవకాశాలపై అడిగిన ప్రశ్నలకు రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జనసేన పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోందని, అలాంటి పార్టీతో తెలంగాణలో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశం లేదని సూటిగా చెప్పారు. జనసేన పార్టీ బీజేపీతో పొత్తు ఉందని, ఆ పార్టీలతో టీడీపీ పొత్తు పెట్టు పెట్టుకొని, తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు అంటే కుదరదని రేవంత్ పేర్కొన్నాడు. తనకు పాలకుర్తి నుండి కూడా పోటీ చేయాలని ఒత్తడి వస్తోందని, కానీ తాను కొడంగల్ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.