చకచకా ఎయిర్పోర్ట్ మెట్రో పనులు
AIRPORT METRO Rail :హైదరాబాద్ (Hyderabad)లో కొత్త మెట్రో లైన్ .. ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ ( AIRPORT METRO RAIL) నిర్మాణం పనులు ఊపందుకున్నాయి. బుధవారం ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్‌కు గ్లోబల్ టెండర్ల (Globle Tenders) ను ఆహ్వానించిన అధికారులు (Governmnet)కొత్త రూట్లో ఎక్కడెక్కడ స్టేషన్లుండాలో తేల్చింది. రాయదుర్గం (Rayadurgam)నుంచి శంషాబాద్ విమానాశ్రయం (Samshabad Airport) వరకు 31 కిలో మీటర్ల (KM) మార్గంలో తొమ్మిది మెట్రో స్టేషన్లు (Metro Stations)నిర్మించాలని ప్రణాళిక సిద్దం చేసింది.
రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ దాకా 9 స్టేషన్లు
రాయదుర్గం వద్ద మొదటి స్టేషన్ ప్రారంభం కాగా ఆ తర్వాతి స్టేషన్లు.. బయోడైవర్సిటీ కూడలి, నానక్ రాంగూడ కూడలి, నార్సింగి, అప్పా కూడలి, రాజేంద్రనగర్, శంషాబాద్ పట్టణం, విమానాశ్రయంలో జారీయ రహదారికి కొద్ది దూరంలో, విమానాశ్రయం టెర్మినల్ లో భూగర్భ మెట్రోస్టేషన్‌తో ముగుస్తుంది. అయితే వంపులు లేని చోట్ల స్టేషన్లు నిర్మిస్తారు.
భవిష్యత్ లో మరో నాలుగు మెట్రో స్టేషన్లు..
మెట్రో ప్రయాణ వేగం, బ్రేకింగ్ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని వాటిని ఖరారు చేస్తారు. అయితే భవిష్యత్తులో మరో నాలుగు స్టేషన్లు కూడా ఏర్పాటు చేసుకునేలా అలైన్ మెంట్ ను డిజైన్ చేశారు. భవిష్యత్తులో నార్సింగి, అప్పాకూడలి మధ్య మంచిరేవుల వద్ద ఒక స్టేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అలాగే అప్పాకూడలి, రాజేంద్రనగర్ మధ్యలో కిస్మత్ పూర్ లోనూ ఓ స్టేషన్ నిర్మించాలని కూడా ప్రతిపాదన ఉంది. రాజేంద్రనగర్ నుంచి శంషాబాద్ మధ్యలో కూడా మరో స్టేషన్ నిర్మించే యోచన ఉంది.
5,688 కోట్ల అంచనా వ్యయం
ఎయిర్ పోర్టు మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే, పెగ్ మార్కింగ్, అలైన్మెంట్ ఫిక్సేషన్ వంటి ప్రాథమిక పనులు అన్నీ ఇప్పటికే పూర్తి అయ్యాయి. భూ సామర్థ్య పరీక్షలు కూడా ఇప్పటికే సాగుతున్నాయి. రూ 5,688 కోట్ల అంచనాతో టెండర్లను ఆహ్వానించింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఈ ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్‌కు ఈపీపీ గ్లోబెల్ టెండర్లను పిలిచారు.
ప్రాజెక్టు వ్యయం, టెండర్ విలువ వేర్వేరు
ప్రాజెక్టు వ్యయం, టెండర్ విలువ రెండూ వేర్వేరని వివరించారు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. రాయదుర్గం నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో ప్రాజెక్టుకు మొత్తం వ్యయం అంచనా రూ. 6,250 కోట్లు. అయితే ప్రస్తుతం మాత్రం రూ. 5,688 కోట్లకే టెండర్లను ఆహ్వానించారు. అంచనా వేసిన టెండర్ విలువలో జీసీ ఖర్చు, ఆకస్మిక పరిస్థితులు, మల్టీ మాడల్ ఇంటిగ్రేషన్ వంటివి ఉండవని.. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో మాత్రం అవి ఉంటాయని, ఈ కారణంగానే ప్రాజెక్టు వ్యయం, టెండర్ మధ్య వ్యత్యాసం ఉంటుందన్నారాయన.