భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతున్నది. నేడు ఏడో రోజు యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ హైదరాబాద్‌లోకి ప్రవేశించనున్నారు. ఈరోజు ఉదయం 6 గంటలకు శంషాబాద్‌లో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం అయింది. ఉదయం 9 గంటలకు ఆరాంఘర్‌కు చేరుకోనున్నారు. ఉదయం 10:30 గంటలకు తాడ్‌బండ్ వద్ద ఉన్న లెజెండ్ ప్యాలెస్ కు చేరుకొని అక్కడ విరామం తీసుకోనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు తిరిగి పురానాపూల్ వద్ద యాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది.
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతున్నది. నేడు ఏడో రోజు యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ హైదరాబాద్‌లోకి ప్రవేశించనున్నారు. ఈరోజు ఉదయం 6 గంటలకు శంషాబాద్‌లో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం అయింది. ఉదయం 9 గంటలకు ఆరాంఘర్‌కు చేరుకోనున్నారు. ఉదయం 10:30 గంటలకు తాడ్‌బండ్ వద్ద ఉన్న లెజెండ్ ప్యాలెస్ కు చేరుకొని అక్కడ విరామం తీసుకోనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు తిరిగి పురానాపూల్ వద్ద యాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. హుస్సేనీ ఆలం, లాడ్ బజార్ మీదుగా సాయంత్రం 4:30 గంటలకు రాహుల్ గాంధీ చార్మీనార్కు చేరుకుంటారు. చార్మీనార్ వద్ద రాహుల్ గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
అనంతరం గుల్జార్ హౌస్, మదీనా, నయాపూల్, ఉస్మాన్ గంజ్, మొజాంజాహీ మార్కెట్, గాంధీభవన్, నాంపల్లి, పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీ, ఏజీ ఆఫీస్, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా నెక్లస్ రోడ్‌కు చేరుకుంటారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ లో పాదయాత్ర సందర్బంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక నెక్లస్ రోడ్లో పబ్లిక్ మీటింగ్ జరగనున్నది. రాత్రి 7 గంటలకు ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర మీటింగ్ జరగనున్నది. ఈరోజు రాత్రి 7 గంటలకు పబ్లిక్ మీటింగ్‌లో రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా ప్రసంగించనున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర హైదరాబాద్‌లో జరగనున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.