హైదరాబాద్‌లో రోజు రోజుకీ పబ్ కల్చర్ (Pubs in Hyderabad) పెరిగిపోతుంది. పబ్ లు సమయంతో పనిలేకుండా తెల్లవార్లూ తెరిచే ఉంటున్నాయి. హైదరాబాద్ (Hyderabad) లో పబ్ కల్చర్ యువతకు ఫ్యాషన్ గా మారింది. వీకెండ్ వచ్చిందంటే చాలు ఫ్రెండ్స్, కొలీగ్స్ తో కలిసి పబ్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు.
Pub Culture: హైదరాబాద్‌లో రోజు రోజుకీ పబ్ కల్చర్ (Pubs in Hyderabad) పెరిగిపోతుంది. పబ్ లు సమయంతో పనిలేకుండా తెల్లవార్లూ తెరిచే ఉంటున్నాయి. హైదరాబాద్ (Hyderabad) లో పబ్ కల్చర్ యువతకు ఫ్యాషన్ గా మారింది. వీకెండ్ వచ్చిందంటే చాలు ఫ్రెండ్స్, కొలీగ్స్ తో కలిసి పబ్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్య పబ్ కల్చర్ (Pub Culture) మరీ ఎక్కువయ్యింది. నైట్ పార్టీలకు యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. బంజారా హిల్స్,జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, పంజాగుట్ట, కొత్తగూడ వంటి ప్రాంతాల్లో ఈ పబ్ కల్చర్ ఎక్కువగా ఉంది. చెవులు చిల్లులు పడే మ్యూజిక్, (Music) ఏరులై పారే మద్యం, మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించే యూత్, కని కనిపించని లైటింగ్ ఇంకేముంది యువత ఉత్సాహానికి అడ్డే ముంటుంది. నచ్చినట్టు ఆడిపాడుతూ.. ఫుల్ గా మద్యం సేవించి చిందులు వేయడం యువతకు పరిపాటిగా మారింది. ఇక రణగొన ధ్వనులు షరా మామూలే.ఈ పబ్ లు ఉన్న ప్రతీ చోట విపరీతమైన సౌండ్ పొల్యూషన్ ఉంటుంది. వారికి అగ్నిమాపక నిబంధనలు కూడా పట్టడం లేదు. చాలా పబ్ లకు కనీసం పార్కింగ్ సౌకర్యం లేదు. దీనికి పబ్ కు వచ్చినవారికీ పలు ఆఫర్లు కూడా ప్రకటిస్తుందియాజమాన్యం తాగి ఇంటికి వెళ్లే వారికీ క్యాబ్ సౌకర్యాన్నికూడా ఏర్పాటు చేస్తుంది.
ఈ పబ్ కల్చర్ (Pub Culture)యూత్ (Youth) ను మద్యానికి, డ్రగ్స్ కు బానిసలను చేస్తుంది. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి, మానసిక ఉల్లాసానికి, పబ్బులకు వెళ్తున్నామని చెప్తున్నా యువతను తమ ఆఫర్లతో ఆకట్టుకుని అగాధంలోకి నెడుతున్నాయి. ఇప్పటికే సరైన అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా పబ్ లు యూత్ వీకినెస్ ను ఆసరాగా చేసుకుని కాసుల వేట కొనసాగిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు ఆఫర్లు ప్రకటిస్తూ మద్యం మత్తులో జోగేలా చేస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో మొత్తం 48 పబ్ లు ఉన్నాయి. పబ్ ల విషయంలో గతంలో హైకోర్టు (Ts High Court) ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud)పబ్ ల యజమానులతో సమీక్ష నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలను పాటించాలని కోరారు. పబ్ లలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.
పబ్బుల్లో డ్రగ్స్ (Drugs) వినియోగిస్తే యాజమాన్యాలే బాధ్యత వహించాలి. పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అట్టి పబ్బులపై (Pubs) అధికారులు చర్యలు తీసుకోవాలి. పబ్బుల్లో జరుగుతున్న అసాంఘికకార్యకలాపాలను యాజమాన్యాలు గమనించాలని అంటున్నారు. అర్ధరాత్రిళ్లు డీజే సౌండ్స్‌తో (Dj sound) అమ్మాయిల అశ్లీల నృత్యాలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. గంటగంటకు రేట్లు పెంచుతూ లక్షల్లో దండుకుంటారు. విదేశీ యువతులతో క్యాబరేలు ఏర్పాటు చేసి కస్టమర్ల నుండి అందినకాడికి దండుకుంటారు. పైకి కాఫీ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల (Bars and Restaurants) పేరుతో చలామణి అవుతూ నిబంధనలకు విరుద్దంగా పబ్స్ నడుపుతున్న వ్యవహారాలు ఈ మధ్య వెలుగు చూస్తున్నాయి. ఇటువంటి చట్టవిరుద్ధమైన పనులకు స్వస్తి చెప్పలని ప్రభుత్వం పబ్ యాజమాన్యాలకు వార్నింగ్ లు ఇచ్చాయి. ఇక యువతకు మంచి మంచి ఆఫర్లతో (Offers) కొత్త కొత్త పబ్ లు పుట్టుకొస్తున్నాయి. వీటికి ప్రభుత్వం యదేచ్చగా అనుమతులిస్తుంది.
హైదరాబాద్, బెంగుళూరు, ముంబయి, చెన్నై, న్యూఢిల్లీ వంటి నగరాల్లో సగానికిపైగా 17 ఏళ్లలోపు అబ్బాయిలు, చాలామంది అమ్మాయిలు బార్లు, పబ్బుల వెంబడి తిరుగుతున్నారని ఓ సర్వేలో తేలింది. కాలేజ్ డే, ఫ్రేషర్స్ డే, లవర్స్ డే, న్యూఇయర్ (New yerar) సంబరాలంటూ చాలామంది పబ్బుల్లో గడుపుతున్నారని ఆ సర్వేలో తేలింది. రెండున్నరేళ్ల క్రితం కరోనా వైరస్ మహమ్మారి విజృంభించడంతో చాలావరకు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని ఇచ్చాయి. వైరస్ ప్రభావం తగ్గినా ఇప్పటికీ అనేక ఆఫీసులు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) మాత్రమే కాదు, కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అంటే ఎక్కడి నుంచైనా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ పబ్ కల్చర్‌తో యూకేలో పబ్‌కు వచ్చే కస్టమర్ల సంఖ్య పెరిగిపోతోంది. అటు పబ్‌ల ఆదాయం కూడా పెరుగుతోంది. ఫుల్లర్స్ చైన్‌లో ఉన్న 380 పబ్స్ వర్క్ ఎన్విరాన్మెంట్ని అందిస్తున్నాయి. అంటే ఉద్యోగులు (Employes) వచ్చి తమ ఆఫీసు పని చేసుకోవడానికి వీలుగా సౌకర్యాలు ఉంటున్నాయి. ఆ విధానం మన భారత దేశంలో కొన్ని పబ్బుల్లో చోటుచేసుకుంది. ఎలాంటి ఆఫర్లవల్ల ఉద్యోగుల మైండ్ కొంచెం రిలీఫ్ గా ఉండి ఎక్కువ ఉత్సహంతో పనిచేయడానికి వీలుంటుందని అంటున్నారు. అదేవిధంగా పబుల్లో తగి పడిపోయిన వారిని క్షేమంగా ఇంటికి చేరేలా క్యాబ్ (Cab System) సిస్టం ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇలాంటి ఆఫర్ లతో పబ్బులు ముందుకొస్తుంటే యువత నైట్ పార్టీలకు మొగ్గు చూపుతుంది. ఇటువంటి పబ్బులకు విచ్చలవిడిగా ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది..అంతేకాదు ఈ నైట్ లైఫ్ డిమాండ్ తో బాటు మద్దతు కూడా పెరిగింది. అలాగే ప్రభుత్వం కూడా ఈ పబ్బులపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతుండడంతో అసంఘటిత కార్యకలాపాలకు చెక్ పెడుతుంది.