తెలంగాణ కాంగ్రెస్లో మరింత ఊపుతెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో వచ్చిన ఊపుతో తెలంగాణలో కూడా మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ప్రియాంకగాంధీని తెలంగాణలో పలు ప్రాంతాల్లో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు
Priyanka Gandhi will visit Hyderabad, for every 10 days, says Revanth reddy
తెలంగాణ కాంగ్రెస్లో మరింత ఊపుతెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో వచ్చిన ఊపుతో తెలంగాణలో కూడా మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ప్రియాంకగాంధీని తెలంగాణలో పలు ప్రాంతాల్లో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ప్రతి 10 రోజులకొకసారి ప్రియాంక గాంధీ హైదరాబాద్ వస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అంతటా ప్రియాంకగాంధీ తిరుగుతారని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
లక్షల కోట్ల కుంభకోణం
తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే జీవో 111 రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ధన దాహంతో అస్తవ్యస్థ నిర్ణయాలు తీసుకుంటున్నారని సీఎం కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 111 జీవో ఎత్తివేత వెనక లక్షల కోట్ల కుంభకోణం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. 111 go ఎత్తివేత వెనక భారీ భూ కుంభకోణం ఉందని..విచారణ జరగాలని రేవంత్ రెడ్డి కోరారు.
రేవంత్ దూకుడుకు సీనియర్ల కళ్లెం
పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మధు యాష్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కోవర్తులు ఉన్నారని గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మధు యాష్కీ గుర్తుచేశారు. ఆ వ్యాఖ్యలు పార్టీలోని చాలా మంది నాయకులను ఇబ్బంది పెట్టాయని మధుయాష్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు. .పార్టీలో కోవర్తులు లేరని రేవంత్ రెడ్డి ఈ రోజు చెప్పడం మంచి పరిణామని మధు యాష్కీ అన్నారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అందకం కలిసి పనిచేద్దామని మధు యాష్కీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కర్ఱాటకలోని పరిణామాలను గుర్తుచేసుకున్నారు. కర్ణాటకలో డీకే, సిద్ధరామయ్యలు కలిసి పనిచేశారని, ఆ కారణంగానే అధికారంలోకి వచ్చారని మధు యాష్కీ గుర్తుచేశారు.