Vande Bharath: వందే భారత్ లాంచ్ చేసేందుకు తెలంగాణకు మోడీ?
Prime Minister Modi to Launch Vande Bharath at Secundrabad: ఈ నెలలో తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోడీ రానున్నారు. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో రాష్ట్రానికి మోడీ వచ్చే అవకాశం ఇక వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించనున్న ప్రధాని ఆ అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు కూడా ప్రారంభించనున్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మోడీ ప్రసంగం ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వరుసగా రాష్ట్రాలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మంజూరు చేస్తోంది. ఇప్పటికే ఐదు రైళ్లు ప్రారంభమవగా.. ఆరో రైలు తెలంగాణకు రానుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును దక్షిణ మధ్య రైల్వేకు మంజూరుచేసినట్లు ఇప్పటికే ఇక్కడి అధికారులకు సమాచారం అందింది. సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నారు. త్వరలోనే తేదీని ఖరారు చేస్తారు. ఐతే ఈ రైలును ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సమయం కేటాయించాలని ప్రధానిని మోదీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు సార్లు తెలంగాణలో పర్యటించారు. ఫిబ్రవరి సమతా విగ్రహావిష్కరణ, మేలో ఐఎస్‌బీ వార్షికోత్సవం, జులైలో బీజేపీ జాతీయ కార్యకవర్గ సమావేశాలు, నవంబరులో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం కోసం ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వచ్చారు. ఇప్పుడు మరోసారి ఆయన ఇక్కడికి రాబోతూ ఉండడం చర్చనీయాంశం అయింది.