మలక్‌పేట అనురాధ మర్డర్ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. చంద్రమోహన్‌ను తమదైన శైలిలో విచారించిన పోలీసులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అనురాధను చంపిన చంద్రమోహన్ ఆమె సెల్‌ఫోన్ ద్వారా ఆస్ట్రేలియాలో ఉంటున్న ఆమె కుమార్తెతో చాటింగ్ చేశాడు
Police found Several twists in Anuradha Murder Case
మలక్‌పేట అనురాధ మర్డర్ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. చంద్రమోహన్‌ను తమదైన శైలిలో విచారించిన పోలీసులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అనురాధను చంపిన చంద్రమోహన్ ఆమె సెల్‌ఫోన్ ద్వారా ఆస్ట్రేలియాలో ఉంటున్న ఆమె కుమార్తెతో చాటింగ్ చేశాడు. అనురాధ చాటింగ్ చేసినట్లుగా చాటింగ్ చేశాడు. అనురాధ బతికున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.
ఆస్ట్రేలియాలో ఉంటున్న అనురాధ కూతురికి ఎప్పటికప్పుడు చంద్రమోహన్ మెసేజ్ పంపాడు. ఈ నెల 12వ తేదీ నుంచి అనురాధ సెల్ ఫోన్లో కూతురుతో చంద్రమోహన్ చాటింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చార్ ధాం యాత్రలకు వెళ్లే ప్లాన్ చేస్తున్నట్లుగా అనురాధ సెల్‌తో కూతురుకు చంద్రమోహన్ మెసేజ్ పెట్టాడు. మే 12వ తేదీ నుంచి ప్రతినిత్యం కూతురుకు మెసేజ్ పెట్టిన చంద్రమౌళి చివరిగా చార్ధామ్ యాత్రకు వెళుతున్నట్లుగా ఒక మెసేజ్ పెట్టాడు.
రేపటి నుంచి తాను యాత్రలకు బయలుదేరుతున్నట్లుగా మెసేజ్ పెట్టిన చంద్ర మౌళి, అనురాధ బతికి ఉన్నట్లుగానే ఎప్పటికప్పుడు కూతురుకు మెసేజ్ పెట్టేవాడు. చార్ధామ్ యాత్రకు వెళుతున్నందున సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందని కూతురికి మెసేజ్ పెట్టి జాగ్రత్త పాటించాడు.
అనురాధ సెల్‌ఫోన్‌ను బయట ప్రాంతాలకు తీసుకువెళ్లి ధ్వంసం చేయాలని ప్లాన్ చేశాడు. 12వ తేదీ రాత్రి అనురాధను కిరాతకంగా చంపిన చంద్రమోహన్, చంపిన తర్వాత డెడ్ బాడీని ఏం చేయాలో అర్థం కాక ఊరుకున్నాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి బయటపడాలని ప్లాన్ చేశాడు. సూపర్ మార్కెట్‌కు వెళ్లి స్టోన్ కట్టర్స్ కత్తులను కొనుగోలు చేశాడు.
అనురాధ మృతదేహం పైన కూర్చొని కటర్‌తో ముక్కలుగా కోశాడు. డెడ్ బాడీని నీట్‌గా ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు.
17వ తేదీన తలను తీసుకొని మూసినదిలో పడవేశాడు. అనురాధ రూమ్‌లో పడ్డ రక్తపు మరకాలను కెమికల్స్ తో శుభ్రం చేశాడు. పెర్ఫ్యూమ్, అగరబత్తులు, కర్పూరం తో పాటు కెమికల్స్ తో ఎప్పటికప్పుడు రూమును శుభ్రపరచి ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఫ్రిజ్‌లో నుంచి వచ్చిన దుర్వాసనను బట్టి కెమికల్స్ ని వాడిన చంద్రమోహన్ అతి తెలివిని ప్రదర్శించాడు.
మృతదేహాన్ని ఒక్కొక్క పార్ట్ నీ పది రోజులకు చొప్పున ఒక్కొక్క ఒక్కో ప్రాంతంలో పడేవేయాలని ప్లాన్ వేశాడు. ఇవాళ సూట్ కేస్ లో కడుపు భాగాన్ని ప్యాక్ చేసి పడ వేసేందుకు సిద్ధంగా ఉన్న చంద్రమోహన్ పోలీసుకు చిక్కాడు. పోలీసులను చూసి జంకు బంకు లేకుండా సమాధానం చెప్పిన చంద్రమోహన్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో దొరికిపోయాడు. పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి పూర్తి వివరాలను రాబట్టారు.